వార్నీ.. మేకపై గొర్రె తోలు.. పాక్‌లో వింత మోసాలు..!

రాబోయే బక్రీద్‌ సందర్భంగా మేకలను, గొర్రెలను ముస్లింలు కుర్బానీ( బలి ఇవ్వడం) చేసే విషయం తెలిసిందే. అయితే ఈ పండుగ వస్తే.. మేకలకు, గొర్రెలకు విపరీతమైన డిమాండ్..

వార్నీ.. మేకపై గొర్రె తోలు.. పాక్‌లో వింత మోసాలు..!
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 4:13 AM

రాబోయే బక్రీద్‌ సందర్భంగా మేకలను, గొర్రెలను ముస్లింలు కుర్బానీ( బలి ఇవ్వడం) చేసే విషయం తెలిసిందే. అయితే ఈ పండుగ వస్తే.. మేకలకు, గొర్రెలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. అంతేకాదు.. వీటి ధర కూడా అమాంతం పెరుగుతుంటాయి. అయితే ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు పాక్‌లో ఓ వ్యాపారి తన కన్నింగ్‌ బుర్రకు పదునుపెట్టాడు. తన దేశానికి చెందిన ప్రజలకు బుర్రలేదనుకున్నాడో ఏందో కానీ.. మేకకు గొర్రె తోలు కప్పేసి.. గొర్రెలంటూ అమ్మడం ప్రారంభించాడు. మేక కంటే గొర్రెకు కాస్త ధర ఎక్కువ వస్తుందని ఈ ప్లాన్ వేశాడు. అయితే ఓ వ్యక్తి గొర్రెను కొందామనుకుని అక్కడి వెళ్లి చూడగా.. ఏదో తేడా కొడుతుందని దానిని పరిశీలించాడు. మేకలా ఉందన్న అనుమానంతో మరింత పరిశీలించగా.. గొర్రె తోలు కింద మేక తోలు కన్పించింది. దీంతో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా.. మేకకు గొర్రె తోలు తొడిగినట్లు గుర్తించాడు. దీంతో అక్కడ ఉన్న కస్టమర్లంతా షాక్‌కు గురయ్యారు. అయితే ఈ విషయం ప్రజలందరికీ తెలిసేలా.. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. దీంతో వీడియో తెగ వైరల్‌ అయ్యింది.