GHMC New Scheme: హైదరాబాద్‌లో ఇంటి వద్దకే భోజనం.. కేవలం రూ.5 మాత్రమే.!

|

Mar 03, 2020 | 2:16 PM

GHMC New Scheme: వందలాది మంది పేదవారి ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ భోజన పధకాన్ని జీహెచ్ఎంసీ మరింత మెరుగుపరచనుంది. ఈ పథకం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మొబైల్ అన్నపూర్ణ’ అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టారు. హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఈ పధకాన్ని నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేశారు. దీని ద్వారా ఇంటి చెంతకే భోజనం తీసుకెళ్లి ఇవ్వనున్నట్లు వారు వెల్లడించారు. వృద్దులు, పిల్లలు, వికలాంగులు, రోగులు వంటివారికి ఈ పథకం ఎంతగానో మేలు చేస్తుందన్నారు. ఇందులో […]

GHMC New Scheme: హైదరాబాద్‌లో ఇంటి వద్దకే భోజనం.. కేవలం రూ.5 మాత్రమే.!
Follow us on

GHMC New Scheme: వందలాది మంది పేదవారి ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ భోజన పధకాన్ని జీహెచ్ఎంసీ మరింత మెరుగుపరచనుంది. ఈ పథకం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మొబైల్ అన్నపూర్ణ’ అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టారు. హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో ఈ పధకాన్ని నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేశారు. దీని ద్వారా ఇంటి చెంతకే భోజనం తీసుకెళ్లి ఇవ్వనున్నట్లు వారు వెల్లడించారు.

వృద్దులు, పిల్లలు, వికలాంగులు, రోగులు వంటివారికి ఈ పథకం ఎంతగానో మేలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే తొలి విడతగా సోమవారం 5 జోన్లలో ప్రారంభించారు. ఇంటి వద్దకే భోజనం అవసరమైన వారిని గుర్తించి ఆటోల ద్వారా లంచ్ బాక్సులను సరఫరా చేస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన లంచ్ బాక్సుల్లో అన్నం, సాంబారును లబ్దిదారులకు చేరవేస్తారు. భోజనం చేశాక మళ్ళీ తిరిగి ఆ బాక్సులను ఆటోల్లోనే తీసుకెళ్తారు. ఈ పథకం కింద ప్రస్తుతం 35 వేల మంది ఆకలి తీరుస్తున్నారు. రూ.24 విలువైన భోజనాన్ని రూ.5కే అందిస్తున్నట్లు చెప్పారు.

For More News: 

రైళ్లలో రేప్‌లు.. విస్తుపోయే నిజాలు.!

అందంగా లేనేమో.. అందుకే తప్పించారేమో.. సమీరా కామెంట్!

కోహ్లీ దురుసుతనాన్ని భూతద్ధంలో పెట్టి చూడలేం.. విలియమ్సన్‌

రౌడీగారు.. మరీ ఇంత నాటీనా.?

మహేష్ బాబు వీరాభిమాని మృతి.. కారణమిదేనా.?

టెస్ట్ ఛాంపియన్‌షిప్.. కోహ్లీసేనకు ముందుంది ముసళ్ల పండగ..!

మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉందా.? అయితే ఇది మీకోసమే.?

మృతి చెందిన టీచర్ ‘సస్పెన్షన్’.. బీహార్ విద్యాశాఖ నిర్వాకం.!