GHMC Election Results 2020:గ్రేటర్‌ కౌంటింగ్‌లో తొలిరౌండ్‌ ఫలితాలు వెల్లడయ్యాయి.

| Edited By: Team Veegam

Dec 04, 2020 | 3:23 PM

గ్రేటర్‌ కౌంటింగ్‌లో తొలిరౌండ్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో నిలిచింది. ఆర్సీపురం, పటాన్‌చెరు, చందానగర్‌, చర్లపల్లిలో గులాబీ జెండా ఎగురుతోంది. జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, బాలానగర్‌, కాప్రాలోనూ..

GHMC Election Results 2020:గ్రేటర్‌ కౌంటింగ్‌లో తొలిరౌండ్‌ ఫలితాలు వెల్లడయ్యాయి.
Follow us on

గ్రేటర్‌ కౌంటింగ్‌లో తొలిరౌండ్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో నిలిచింది. ఆర్సీపురం, పటాన్‌చెరు, చందానగర్‌, చర్లపల్లిలో గులాబీ జెండా ఎగురుతోంది. జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, బాలానగర్‌, కాప్రాలోనూ కారు జోరు చూపుతోంది. అలాగే మీర్‌పేట్ హెచ్‌బీకాలనీ, గచ్చిబౌలి, భారతీనగర్‌, శేరిలింగంపల్లి, గాజులరామారం, రామచంద్రాపురంలోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది.

మరికొన్ని డివిజన్లలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. గడ్డిఅన్నారం, చైతన్యపురి, ఆర్కేపురం, సరూర్‌నగర్‌లో కాషాయ జెండా ఎగురుతోంది. హయత్‌నగర్‌లో బీజేపీ లీడ్‌లో ఉంది. అటు పాతబస్తీలో ఎంఐఎం జెండా ఎగురుతోంది. పలు డివిజన్లలో ఎంఐఎం ముందంజలో ఉంది. మెహదీపట్నంలోనూ మజ్లిస్‌ దూసుకెళ్తోంది.

గ్రేటర్‌ కౌంటింగ్‌లో తొలిరౌండ్‌లో 150 స్థానాలకు గానూ టీఆర్‌ఎస్‌ 42, బీజేపీ 18, ఎమ్‌ఐఎమ్‌ 20 స్థానాలు కైవసం చేసుకున్నాయి.
Read more:

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..