కరోనా ఎఫెక్ట్: ఒక్క పాజిటివ్‌ కేసుతో 14 గ్రామాలు మూసివేత..!

| Edited By:

Apr 13, 2020 | 4:17 PM

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఏపీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఉత్తరప్రదేశ్‌లో 14 గ్రామాలను నిర్బంధంలో ఉంచారు. యూపీలోని బడౌన్‌ జిల్లాలో భవానీపూర్‌ కాలీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి నివసిస్తున్నాడని, అతడు గత నెలలో దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌ సమ్మేళనంలో పాల్గొన్నాడని తెలిసింది. శనివారం అతడికి కరోనా సోకిందని, దీంతో 3 కి.మీ వ్యాసార్థంలో ఉన్న […]

కరోనా ఎఫెక్ట్: ఒక్క పాజిటివ్‌ కేసుతో 14 గ్రామాలు మూసివేత..!
Follow us on

కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఏపీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఉత్తరప్రదేశ్‌లో 14 గ్రామాలను నిర్బంధంలో ఉంచారు. యూపీలోని బడౌన్‌ జిల్లాలో భవానీపూర్‌ కాలీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి నివసిస్తున్నాడని, అతడు గత నెలలో దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌ సమ్మేళనంలో పాల్గొన్నాడని తెలిసింది. శనివారం అతడికి కరోనా సోకిందని, దీంతో 3 కి.మీ వ్యాసార్థంలో ఉన్న గ్రామాలను మూసివేస్తున్నట్లు బడాన్‌ జిల్లా కలెక్టర్‌ కుమార్‌ ప్రశాంత్ తెలిపారు.

కాగా.. ”కోవిద్ 19 సోకిందని తెలియడంతో అతడు నివసిస్తున్న గ్రామానికి 3 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న 14 గ్రామాలను మూసివేశాం. దీంతో ప్రస్తుతం ఆ 14 గ్రామాలు క్వారంటైన్‌లో ఉన్నాయి” అని కుమార్‌ వెల్లడించారు. మరోవైపు ఆగ్రాలో సోమవారం 30 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 134కు చేరింది. దీనిలో దాదాపు 60 మంది తబ్లీగ్‌ జమాత్‌ సమ్మేళనంలో పాల్గొన్నారని ఆగ్రా జిల్లా కలెక్టర్‌ ప్రభు ఎన్‌ సింగ్ తెలిపారు. దీంతో ఉత్తరప్రదేశ్‌లో కరోనా సోకిన వారి సంఖ్య 483కు చేరింది.

Also Read: వాహనదారులకు అలర్ట్: అక్కడ.. నో మాస్క్… నో పెట్రోల్…

Also Read: అలా చేశారో… ఆరు నెలలు జైలే..!