వ్యాక్సిన్‌ ముందుగా తీసుకునేందుకు బిల్ క్లింటన్‌, జార్జ్ డబ్ల్యు బుష్, ఒబామా రెడీ, ప్రజల్లో విశ్వాసం కలిగించడమే లక్ష్యం

|

Dec 04, 2020 | 5:14 AM

కరోనా వ్యాక్సినేషన్‌కు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ భద్రతపై ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించేందుకు స్వచ్చందంగా...

వ్యాక్సిన్‌ ముందుగా తీసుకునేందుకు బిల్ క్లింటన్‌, జార్జ్ డబ్ల్యు బుష్, ఒబామా రెడీ, ప్రజల్లో విశ్వాసం కలిగించడమే లక్ష్యం
Follow us on

కరోనా వ్యాక్సినేషన్‌కు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ భద్రతపై ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చారు ముగ్గురు మాజీ అధ్యక్షులు.. వ్యాక్సిన్‌ను ముందుగా తీసుకునేందుకు బిల్ క్లింటన్‌, జార్జ్ డబ్ల్యు బుష్, బరాక్‌ ఒబామా అంగీకరించారు. కరోనా వ్యాక్సిన్‌పై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ఇది శక్తివంతమైన సందేశంగా ఉంటుందని భావిస్తున్నారు. గతంలో కూడా అమెరికా మాజీ అధ్యక్షులు సేవా కార్యక్రమాల కోసం కలిసి కట్టుగా వేదిక పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. కాగా, అమెరికాలో కరోనా వ్యాక్సిన్‌ సరఫరా కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి 10 కోట్ల మందికి టీకా అందేలా కసరత్తు చేస్తున్నారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్- ఎఫ్‌డీఏ ఆమోద ముద్ర పడగానే దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని హెల్త్‌ సెక్రెటరీ అలెక్స్ అజార్, ఆపరేషన్‌ వార్‌ స్పీడ్‌ చీఫ్ అడ్వైజర్ మోన్సెఫ్ స్లాయీ తెలిపారు.