New Coronavirus Strain in AP : ఏపీలో తొలి స్ట్రెయిన్ వైరస్ కేసు నమోదు..రాజమండ్రి వచ్చిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ

|

Dec 29, 2020 | 5:08 PM

ఏపీ  ప్రజలకు అలెర్ట్.  రాష్ట్రంలో కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ తొలి కేసు నమోదైంది. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు స్ట్రెయిన్‌ సోకినట్లు నిర్ధారణ అయినట్లు...

New Coronavirus Strain in AP : ఏపీలో తొలి స్ట్రెయిన్ వైరస్ కేసు నమోదు..రాజమండ్రి వచ్చిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ
Follow us on

New Coronavirus Strain in AP :  ఏపీ  ప్రజలకు అలెర్ట్.  రాష్ట్రంలో కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ తొలి కేసు నమోదైంది. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు స్ట్రెయిన్‌ సోకినట్లు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ అధికారికంగా తెలిపారు. సీసీఎంబీ, ఎన్‌ఐవీ నివేదికల ఆధారంగా స్ట్రెయిన్‌ అతి తేలినట్లు వివరించారు. సదరు మహిళ 10 రోజుల క్రితం కుమారుడితో సహా యూకే నుంచి రాజమండ్రి వచ్చిందని చెప్పారు. మహిళ నుంచి మరెవరికీ కరోనా సోకలేదని..ఆమె కాంటాక్టు అయిన వ్యక్తులకు పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు. యూకే నుంచి వచ్చిన వారి వల్ల రాష్ట్రంలో స్ట్రెయిన్ విస్తరించిన దాఖలాలు లేవని చెప్పారు.  రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వివరించారు.  అపోహలను నమ్మవద్దని ప్రజలను వైద్యారోగ్యశాఖ వైద్యఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ కోరారు.

Also Read :

Molar Pregnancy : విచిత్రమైన ముత్యాల గర్భం…ప్రెగ్నంట్ అవుతారు..కానీ కడుపులో బిడ్డ ఉండదు

‘Master’ release date : ‘సంక్రాంతి బరిలోకి నేనూ వస్తున్నా’..రేస్‌లోకి దూసుకువచ్చిన ఇళయదళపతి విజయ్