ఆబిడ్స్‌ ట్రూప్‌ బజారులో అగ్ని ప్రమాదం, మూసి ప్రాంతంలో అర్ధరాత్రిహై వోల్టేజ్, ఫిట్స్ రావడంతో ఐరన్ గ్రిల్స్ మధ్య తలపెట్టి..ఆపై. !

|

Feb 06, 2021 | 5:52 AM

హైదరాబాద్ ఆబిడ్స్‌ ట్రూప్‌ బజారులో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను..

ఆబిడ్స్‌ ట్రూప్‌ బజారులో అగ్ని ప్రమాదం,  మూసి ప్రాంతంలో అర్ధరాత్రిహై వోల్టేజ్, ఫిట్స్ రావడంతో ఐరన్ గ్రిల్స్ మధ్య తలపెట్టి..ఆపై. !
Follow us on

హైదరాబాద్ ఆబిడ్స్‌ ట్రూప్‌ బజారులో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్కెట్లో జరిగిన ఈ ఘటన అక్కడి వ్యాపారులను ఆందోళనకు గురి చేసింది. మరోవైపు, హైదరాబాద్ చాదర్ ఘాట్ మూసి పరివాహిక ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో హై వోల్టేజ్ విద్యుత్ సరఫరా కలకలం రేపింది.. స్థానిక మూసానగర్‌ బస్తీలోని చాలా ఇళల్లో టీవీలు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఫ్రీడ్జ్ కాలి బూడిదగా మారాయి. దీంతో స్థానికులు విద్యుత్‌ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కాగా, ఇంస్టాగ్రామ్‌లో పరిచయం చేసుకొని అమ్మాయిలను వేధిస్తున్న వ్యక్తిని పోలీసుల పట్టుకున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐపీ అడ్రస్‌ గుర్తించారు. నగర శివారు అబ్దుల్లాపూర్ మెట్ రామన్నగూడెం కు చెందిన సంతోష్ కుమార్‌ను అరెస్టు చేశారు. ఇలాఉంటే, ఆటో నడుపుతూ ఓ డ్రైవర్ ఫిట్స్ వచ్చి చనిపోయిన సంఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కర్మన్‌ఘాట్ వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ఆంజనేయులు మెట్రో స్టేషన్ దగ్గర ఒక్కసారిగా ఆటో నుండి కింద పడిపోయాడు. రక్తం కక్కుకుని మెట్రో ఐరన్ గ్రిల్స్ మధ్యలో తలపెట్టి మృతి చెందాడు.

విశాఖ మానసిక వైద్యశాలకు చేరిన మదనపల్లి జంట హత్యల కేసు కథ, పద్మజ, పురుషోత్తంనాయుడుకి వేరువేరు వార్డుల్లో చికిత్స