ఫేక్ పోలీసులు : నిండా ముంచేశారు : చివ‌ర‌కు బుక్క‌య్యారు

|

Aug 30, 2020 | 2:59 PM

వారి గెట‌ప్పులు అచ్చం పోలీసుల్లాగే ఉంటాయ్. కొందరు పోలీసు యూనిఫామ్‌లో, మ‌రికొంద‌రు సివిల్ డ్ర‌సుల్లో ఉంటారు. రైడ్‌ల‌ పేరుతో అందిన‌కాడికి దోచుకుంటారు.

ఫేక్ పోలీసులు :  నిండా ముంచేశారు : చివ‌ర‌కు బుక్క‌య్యారు
Follow us on

వారి గెట‌ప్పులు అచ్చం పోలీసుల్లాగే ఉంటాయ్. కొందరు పోలీసు యూనిఫామ్‌లో, మ‌రికొంద‌రు సివిల్ డ్ర‌సుల్లో ఉంటారు. రైడ్‌ల‌ పేరుతో అందిన‌కాడికి దోచుకుంటారు.. బెదిరించి మ‌రీ దండుకుంటారు. న‌మ్మకం కుదిరేలా జీప్ కూడా ఎక్కిస్తారు. ఇప్ప‌టివ‌ర‌కు గుట్టుగా సాగిన ఈ ఫేక్ పోలీసుల దందా గుట్టు ర‌ట్ట‌య్యింది.

శ్రీకాకుళం రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. కరజాడ, బైరి, సింగుపురం, బట్టేరు పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్‌ శాఖ పోలీసులమంటూ కొంద‌రు హ‌డావిడి చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులుగా తమను నియమించిదంటూ రైడ్‌లు చేస్తున్నారు ఐదుగురు వ్య‌క్తులు. వీరంద‌రూ కూడా గార మండలం అంబటివానిపేటకు చెందినవారు. పేరుకు త‌గ్గ‌ట్లుగానే ఇన్నోవా కారులో తిరుగుతూ హడావుడి చేస్తున్నారు. వీరిలో కుంచాల సంతోష్ అనే వ్య‌క్తి 2017లో ఎక్సైజ్‌ శాఖకు పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా స‌మాచారం అందించేవా‌డు. 2018–19 కాలంలో హైదరాబాద్‌లో సీసీ కెమెరాలు తయారు చేసే సంస్థ‌లో పనిలో చేరాడు. 2020 ఫిబ్రవరిలో సొంతూరు వచ్చి జ‌ల్సాలు చేయ‌డం ప్రారంభించాడు. ఒక్క‌సారే ఎక్కువ‌ డబ్బు సంపాదించాల‌నే ఆశ‌తో అడ్డ‌దారులు తొక్క‌డం ప్రారం‌భించాడు. గతంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఫార్మర్‌గా ప‌నిచెయ్య‌డంతో మ‌ద్యం దుకాణాలు, లిక్క‌ర్ అక్ర‌మ ర‌వాణా మార్గాలు తెలుసుకోని ఫేక్ పోలీస్ అవ‌తారం ఎత్తాడు. ఇందుకోసం అదే గ్రామానికి చెందిన మ‌రికొంద‌రు వ్య‌క్తుల‌తో గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక దందాలు షురూ చేశారు. పోలీస్ స్టిక్క‌రింగ్ వేసుకోని అచ్చం నిజ‌మైన పోలీసుల్లానే బిల్డ‌ప్ ఇస్తూ దోపిడీల‌కు తెగ‌బ‌డ్డారు. ప‌లు బెల్టు షాపులు వ‌ద్ద‌కు వెళ్లి డ‌బ్బు వ‌సూలు చేశారు. మ‌రికొంద‌రి వ‌ద్ద మ‌ద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అలా, అలా దందాను విస్త‌రించాడు.

ఈ నెల 25న బుధవారం రాత్రి సింగుపురం, బైరి ఏరియాల్లో ఒకే చోట నాలుగు బెల్టు షాపుల వద్ద దందాలకు తెగ‌బ‌డింది ఈ ముఠా. జితేష్‌కుమార్‌ అనే ఓ వ్య‌క్తి వద్ద మూడు క్వార్టర్ బాటిల్స్‌ ఉన్నాయని తెలుసుకుని బలవంతంగా లాక్కొనేందుకు ట్రై చేశారు. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న సింగుపురం గ్రామస్తులు చూసి పోలీసులైతే ఇలా రోడ్డుపై దాడులకు తెగబడరని అనుమానం వ‌చ్చి ఇద్దరిని అక్కడికక్కడే పట్టుకున్నారు. మిగిలిన ముగ్గురు పారిపోవ‌డంతో రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. వారు మిగిలిన ముగ్గురు నిందితుల‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ ఫేక్ పోలీసుల దందా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

 

Also Read :

“తాత వల్లే తెలుగు నేర్చుకున్నా”

గుంటూరులో తల్లీ, బిడ్డ మరణంపై పలు అనుమానాలు