Drugs Racket: హైదరాబాద్ కేంద్రంగా భారీ డ్రగ్స్ రాకెట్.. ఇండోర్‌లో పట్టుబడ్డ రూ. 70 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలు..

|

Jan 07, 2021 | 1:12 PM

Drugs Rocket: తెలంగాణ రాజధాని హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారుతోందా? స్మగ్గర్లు హైదరాబాద్ కేంద్రంగా మత్తు పదార్థాలు..

Drugs Racket: హైదరాబాద్ కేంద్రంగా భారీ డ్రగ్స్ రాకెట్.. ఇండోర్‌లో పట్టుబడ్డ రూ. 70 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలు..
Follow us on

Drugs Racket: తెలంగాణ రాజధాని హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారుతోందా? స్మగ్గర్లు హైదరాబాద్ కేంద్రంగా మత్తు పదార్థాలు తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నారా? తాజాగా ఇండోర్‌లో పట్టుబడిన డ్రగ్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానం వినిపిస్తుంది. తాజాగా ఇండోర్‌లో రూ. 70 కోట్లు విలువ చేసే 70 కేజీల డ్రగ్స్ పట్టుబడింది. ఆ మొత్తాన్ని అక్కడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇండోర్ మీదుగా సౌత్ ఆఫ్రికాకు డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురు తెలంగాణ వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే డ్రగ్స్‌ ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారనే దానిపై విచారణ చేపట్టగా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఈ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు తేలింది. వేద ప్రకాష్ వ్యాస్ అనే వ్యక్తి 70 కేజీల ఎస్టాకి పిల్స్‌ను తయారు చేసి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ శివారు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఒక కంపెనీలో డ్రగ్స్ తయారు చేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Sabarimala: ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం.. మకర సంక్రాంతి వేళ అయ్యప్ప దర్శనానికి ఆన్‌లైన్ టికెట్లు..

అమెరికా క్యాపిటల్ భవనంలో బాష్పవాయు ప్రయోగం, కాల్పుల్లో మహిళ సహా నలుగురి మృతి, అంతా భీభత్సం