పళనిస్వామిపై నా వ్యాఖ్యలకు చింతిస్తున్నా, క్షమాపణ చెప్పిన డీఎంకే ఎంపీ ఎ.రాజా

| Edited By: Phani CH

Mar 29, 2021 | 1:19 PM

తమిళనాడు సీఎం పళనిస్వామిపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని డీఎంకే ఎంపీ ఎ. రాజా అన్నారు క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు.

పళనిస్వామిపై నా వ్యాఖ్యలకు చింతిస్తున్నా, క్షమాపణ చెప్పిన డీఎంకే ఎంపీ ఎ.రాజా
Dmk Mp A.raja Aplogises To Palaniswami
Follow us on

తమిళనాడు సీఎం పళనిస్వామిపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని డీఎంకే ఎంపీ ఎ. రాజా అన్నారు క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు.  అక్రమ సంబంధానికి పుట్టిన నెలలు నిండని చైల్డ్ అంటూ రాజా తనపై చేసిన వ్యాఖ్యలను  పళనిస్వామి ఓ ఎన్నికల ర్యాలీలో  ఖండిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇది తెలిసిన రాజా ..పళని వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి తాను అలా అనలేదని, డీఎంకే నేత స్టాలిన్, పళని రాజకీయ కెరీర్లను ఉద్దేశించే అలా వ్యాఖ్యానించానని అన్నారు . తన కామెంట్స్ బాధ పెట్టి ఉంటే క్షమించాలని కోరారు. చెన్నైలో జరిగిన ర్యాలీలో పళనిస్వామి  కంట తడి పెడుతూ..తన తల్లి పేద రైతు అని, పగలు, రాత్రి కష్టపడి పని చేసి తనను పెంచి పెద్దను చేసిందని పేర్కొన్నారు. తనను పేదవాడని  చెప్పుకోవడానికి వెనుకంజ వేయనన్నారు.

కాగా- రాజా చేసిన వ్యాఖ్యలకు గాను అన్నాడీఎంకే నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు రాజాపై కేసు పెట్టారు. రాష్ట్రంలో పలు చోట్ల రాజా దిష్టిబొమ్మలను దహనం చేశారు. త్వరలో జరుగనున్న ఎన్నికల ముందు రాజా చేసిన ఈ కామెంట్స్, డీఎంకే  విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బహుశా డీఎంకే నేతలు భావించినట్టు ఉన్నారు. అందువల్లే రాజా వెంటనే క్షమాపణలు చెప్పారు. పైగా ఈసీకి కూడా ఎఐఎండీఎంకే ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నందున ఎందుకైనా మంచిదని రాజా చేత పార్టీ అపాలజీ చెప్పించినట్టు కనిపిస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చదవండి:West Bengal Elections 2021: ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌‌కు తీవ్ర అస్వస్థత.. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరిక..

మయన్మార్ లో రక్తపాతం చాలా దారుణం, టెరిబుల్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆగ్రహం