కొవిడ్‌ వాక్సిన్‌కు డిజిటల్‌ కార్డు తప్పనిసరి కాదు !

|

Oct 22, 2020 | 1:41 PM

కోవిడ్19 వ్యాక్సిన్‌ను పొందేందుకు నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌డీహెచ్‌ఎం) జారీ చేసే డిజిటల్‌ ఆరోగ్యకార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కొవిడ్‌ వాక్సిన్‌కు డిజిటల్‌ కార్డు తప్పనిసరి కాదు !
Follow us on

కోవిడ్19 వ్యాక్సిన్‌ను పొందేందుకు నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌డీహెచ్‌ఎం) జారీ చేసే డిజిటల్‌ ఆరోగ్యకార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ డిజిటల్‌ హెల్త్‌ కార్డు లేనివారు కరోనా వ్యాక్సిన్‌ను పొందేందుకు అనర్హులనే అభిప్రాయం కరెక్ట్ కాదని ఆ శాఖ సెక్రటరీ రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు. వ్యాక్సిన్‌ పంపిణీ చేసేటప్పుడు లబ్ధిదారు వద్ద డిజిటల్ ఆరోగ్యకార్డు లేనప్పుడు..గవర్నమెంట్ జారీ చేసిన ఏ ఇతర గుర్తింపు కార్డునైనా ఉపయోగించవచ్చని తెలిపారు.

 డిజిటల్‌ ఆరోగ్య కార్డు ఏమిటీ?

ఎన్‌డీహెచ్‌ఎం పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. దీనిలో నమోదైన ప్రతి ఒక్కరికీ ఓ ఆరోగ్య గుర్తింపు కార్డు ఇస్తారు. సంబంధిత వ్యక్తి  ఏయే వ్యాధుల బారిన పడ్డాడు.., ఎటువంటి చికిత్స తీసుకున్నాడు, ఏ మెడిసిన్ వాడాడు, ఏయే ఆస్పత్రులలో చికిత్స తీసుకున్నాడు, డిశ్చార్జి తేదీలు తదితర ఆరోగ్య సంబంధ కీలక వివరాలన్నీ ఈ డిజిటల్‌ హెల్త్‌ కార్డులో రికార్డవుతాయి. ఈ ఆరోగ్య కార్డు ద్వారా దేశంలో ప్రతి ఒక్కరికీ మెడికల్ సర్వీసెస్ పొందే అర్హత లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్డుల జారీ ద్వారా దేశంలో ఆరోగ్య సేవల అమలు  పారదర్శకంగా, సమర్థవంతంగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. కాగా దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఓ సమగ్ర విధానం రూపకల్పన చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది మోదీ తెలిపారు.

Also Read :

“వాడి పొగరు ఎగిరే జెండా”, అంచనాలకు మించిన తారక్ టీజర్

నెట్‌ఫ్లిక్స్‌ నయా ఆఫర్.. 48 గంటలు ఉచితం