విషాదం : కరోనాతో సీపీఐఎంఎల్‌ నేత జశ్వంతరావు మృతి

|

Aug 28, 2020 | 8:11 AM

తెలంగాణలో కరోనా తీవ్ర‌త కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఎంతో మంది ఈ మ‌హ‌మ్మారి వైర‌స్‌కు బ‌ల‌య్యారు. సామాన్యుల ప్ర‌జ‌లే కాదు ముందుండి సేవ‌లందిస్తోన్న క‌రోనా వారియ‌ర్స్, ప్రజాప్రతినిధులు, ప్ర‌భుత్వ అధికార‌లు వరకు అంతా కరోనా బారిన పడుతున్నారు.

విషాదం : కరోనాతో సీపీఐఎంఎల్‌ నేత జశ్వంతరావు మృతి
Follow us on

తెలంగాణలో కరోనా తీవ్ర‌త కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఎంతో మంది ఈ మ‌హ‌మ్మారి వైర‌స్‌కు బ‌ల‌య్యారు. సామాన్యుల ప్ర‌జ‌లే కాదు ముందుండి సేవ‌లందిస్తోన్న క‌రోనా వారియ‌ర్స్, ప్రజాప్రతినిధులు, ప్ర‌భుత్వ అధికార‌లు వరకు అంతా కరోనా బారిన పడుతున్నారు. ఇమ్యూనిటి ప‌వ‌ర్ త‌క్కువ‌గా ఉన్నా, వేరే ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు ఏవైనా ఉన్నా..ఈ వైర‌స్ ప్రమాదం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కష్ట‌త‌రంగా మారింది. తాజాగా మ‌రో సీనియ‌ర్ రాజకీయ నాయ‌కుడు క‌రోనా కార‌ణంగా క‌న్నుమూశారు. సీపీఐ ఎంఎల్‌ కేంద్ర కమిటీ కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్‌ పోలవరపు జశ్వంతరావు(73) గురువారం హైదరాబాద్‌లో క‌న్నుమూశారు. 50 ఏళ్లకు పైగా విప్లవ జెండాను స‌ర్వ‌స్వంగా భావించిన ఆయ‌న‌, జనశక్తి, క్లాస్‌ స్ట్రగుల్‌ ప్రతికలకు సంపాదకునిగా ఉన్నారు.

జస్వంతరావు వైద్య శాస్త్రంలో పట్టా పొందారు. మంచి వక్తగా, ఆర్థిక శాస్త్ర నిపుణుడిగా, ఆర్థిక రాజకీయ విశ్లేషకునిగా ఆయనకు మంచి పేరు ఉంది. కామ్రెడ్‌ తరిమెల నాగిరెడ్డి అడుగుజాడ‌ల్లో చివ‌రివ‌ర‌కు పయ‌నించారు. ఆయన మృతి పార్టీతో పాటు ప‌లువురు నాయ‌కులు ప్రకటించారు.

Also  Read :  తెలంగాణ పారిశ్రామిక విధానంపై కేంద్ర మంత్రి ప్రశంసలు