తెలంగాణలో ‘స్ట్రెయిన్’ టెన్షన్.. కొనసాగుతున్న జీన్ మ్యాపింగ్ టెస్టులు.. ఇంకా లభ్యం కాని 156 మంది ఆచూకీ.!

| Edited By: Pardhasaradhi Peri

Dec 29, 2020 | 10:22 AM

Coronavirus Strain Tension: ఇప్పటిదాకా కరోనా వైరస్ తెలంగాణ ప్రజల్లో గుబులు రేపగా.. తాజాగా యూకే 'స్ట్రెయిన్' వైరస్ భయాందోళన కలిగిస్తోంది.

తెలంగాణలో స్ట్రెయిన్ టెన్షన్.. కొనసాగుతున్న జీన్ మ్యాపింగ్ టెస్టులు.. ఇంకా లభ్యం కాని 156 మంది ఆచూకీ.!
Follow us on

Coronavirus Strain Tension: ఇప్పటిదాకా కరోనా వైరస్ తెలంగాణ ప్రజల్లో గుబులు రేపగా.. తాజాగా యూకే ‘స్ట్రెయిన్’ వైరస్ భయాందోళన కలిగిస్తోంది. దీనితో బ్రిటన్ నుంచి వచ్చినవారిపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఇప్పటిదాకా రాష్ట్రానికి 1,216 మంది యూకే ప్రయాణీకులు వచ్చినట్లు వైద్యాశాఖ గుర్తించింది.

ఇందులో 156 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆరుగురు ఇతర దేశాలకు వెళ్లిపోయారు. 58 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో.. ఆయా రాష్ట్రాలకు ఆరోగ్య శాఖ సమాచారం అందించింది. ఇక ఇప్పటిదాకా 996 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 21 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా… మరో తొమ్మిది మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. పాజిటివ్ వచ్చినవారిలో ఉన్నది పాత వైరసా? కొత్త స్ట్రెయినా? అనే విషయం తేల్చడం కోసం అధికారులు సీసీఎంబీకి శాంపిల్స్‌ను పంపించారు.

Also Read: ఏపీలో కొత్త కరోనా వైరస్ మూలాలు.. న్యూ వేరియంట్‌కు N440K నామకరణం.. హెచ్చరిస్తున్న సైంటిస్టులు..