నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

కరోనా కష్టకాలంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందిస్తూ.. ఏపీలో ఖాళీ ఉన్న సుమారు 10,700 గ్రామ/ వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో వార్డు వాలంటీర్ పోస్టులు 5,500 ఉండగా.. వాటికీ కనీస అర్హత పదో తరగతిగా నిర్దేశించారు. 2020 జనవరి 1 నాటికీ 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఏప్రిల్ 24వ తేదీ దరఖాస్తు స్వీకరణకు చివరి […]

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Apr 21, 2020 | 8:23 AM

కరోనా కష్టకాలంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందిస్తూ.. ఏపీలో ఖాళీ ఉన్న సుమారు 10,700 గ్రామ/ వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో వార్డు వాలంటీర్ పోస్టులు 5,500 ఉండగా.. వాటికీ కనీస అర్హత పదో తరగతిగా నిర్దేశించారు. 2020 జనవరి 1 నాటికీ 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఏప్రిల్ 24వ తేదీ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ కాగా.. ఏప్రిల్ 25న పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి.. ఏప్రిల్ 27-29 మధ్య ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మే 1న నియామక ఉత్తర్వులు అందజేస్తారు.

Also Read: ముస్లిం సోదరులకు పాక్ ప్రధాని గుడ్ న్యూస్.. ప్రార్ధనలకు గ్రీన్ సిగ్నల్..

మరోవైపు అర్హులైన వారందరూ ఈ వెబ్‌సైట్‌ (https://gswsvolunteer.apcfss.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నారు. కాగా, ఇంటర్వ్యూ 100 మార్కులు, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై అవగాహనకు సంబంధించి 25 మార్కులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగస్వామ్యం, సేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లయితే 25, నాయకత్వ లక్షణాలు, భావ వ్యక్తీకరణకు 25, ఇతర నైపుణ్యాలకు 25 మార్కులు చొప్పున కేటాయించనున్నారు.

Also Read:గుడ్ న్యూస్.. ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..