శరన్నవరాత్రి ఉత్సవాలపై కరోనా ఎఫెక్ట్.. ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ..!

|

Jul 23, 2020 | 2:15 PM

దేవుళ్లకూ కరోనా తిప్పలు తప్పట్లేదు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతున్న నేపధ్యంలో ఈసారి ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆన్‌లైన్‌ టికెట్లను రెండు నెలలు ముందుగానే ఇస్తామని అధికారులు తెలిపారు.

శరన్నవరాత్రి ఉత్సవాలపై కరోనా ఎఫెక్ట్.. ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ..!
Follow us on

Navarathri Uthsavalu Vijayawada: దేవుళ్లకూ కరోనా తిప్పలు తప్పట్లేదు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతున్న నేపధ్యంలో ఈసారి ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆన్‌లైన్‌ టికెట్లను రెండు నెలలు ముందుగానే ఇస్తామని అధికారులు తెలిపారు. టైంస్లాట్ ప్రకారం భక్తులు దర్శనానికి రావాలని.. రోజుకు 10 వేల మందికి మాత్రమే దర్శనం కల్పిస్తామని దుర్గగుడి ఈవో సురేష్ బాబు వెల్లడించారు.

కరోనా నిబంధనలను పాటిస్తూ దసరా ఉత్సవాలు నిర్వహిస్తామన్న ఆయన.. మరికొద్ది రోజుల్లో దసరా ఏర్పాట్లుపై సీపీ, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అవుతామన్నారు. మూలా నక్షత్రం, విజయదశమి రోజున భక్తులకు ఎలా దర్శనం కల్పించాలన్న దానిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని దుర్గగుడి ఈవో సురేష్ బాబు స్పష్టం చేశారు. కాగా, గతంలో దర్శనానికి రోజుకి 50 వేల మందిని అనుమతించే వాళ్ళమని.. అలాగే మూలా నక్షత్రం రోజున 3 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చేవాళ్ళన్నారు. ఇక ఈసారి దసరా నిరాడంబరంగా జరుగుతుందని ఆయన తెలిపారు.

Also Read:

జగన్ సర్కార్ మరో సంచలనం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ..

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ..

Part 3: ”సుశాంత్‌ది హత్యేనా” ఆత్మ ఏం చెప్పింది.? షాకింగ్ వాస్తవాలు…