దేశంలో కొత్తగా 16,432 పాజిటివ్ కేసులు, 252 మరణాలు.. 96 శాతానికి చేరుకున్న రికవరీ రేటు..

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో 16,432 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ..

దేశంలో కొత్తగా 16,432 పాజిటివ్ కేసులు, 252 మరణాలు.. 96 శాతానికి చేరుకున్న రికవరీ రేటు..
Corona-Virus-India
Follow us

|

Updated on: Dec 29, 2020 | 12:25 PM

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో 16,432 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,24,303 చేరుకుంది. ఇందులో 2,68,581 యాక్టివ్ కేసులు ఉండగా.. 98,07,569 కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా 252 మంది వైరస్ కారణంగా చనిపోవడంతో.. దేశంలో ఇప్పటివరకు 1,48,153 కరోనా మరణాలు సంభవించాయి.

అటు గత కొద్దిరోజులుగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేకపోవడం ఊరటను ఇచ్చే అంశం. అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో శనివారం 24,900 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 2.63 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది. దేశంలో 95.92 శాతానికి రికవరీ రేటు చేరిందంది.