ఏపీలోని ఆ ప్రాంతంలో రేపు సంపూర్ణ లాక్‌డౌన్ !

|

Aug 29, 2020 | 4:39 PM

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రేపు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. కేవలం అత్యవసర సేవల‌కు మిన‌హా ప్ర‌జ‌లెవ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించారు.

ఏపీలోని ఆ ప్రాంతంలో రేపు సంపూర్ణ లాక్‌డౌన్ !
Follow us on

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రేపు సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. కేవలం అత్యవసర సేవల‌కు మిన‌హా ప్ర‌జ‌లెవ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించారు. పట్టణంతో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపారు. రేపు మెడిక‌ల్ షాపులు, పాలు, పెరుగు వంటి విక్రయాలు కూడా ఒంటి గంట వరకే అనుమ‌తి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు, కూరగాయలు, చేపలు, చికెన్, మాంసం విక్రయాలు పూర్తిగా నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రులకు వెళ్లాల‌నే నెపంతో ఎవరైనా అనవసరంగా బైట తిరిగినట్లు నిర్ధారణ అయితే.. అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఆదివారం ఉద‌యం 6 గంట‌ల నుంచి సోమవారం ఉద‌యం 6 గంట‌ల వ‌రకు సంపూర్ణ లాక్‌డౌన్ ఉంటుంద‌ని తెలిపారు. ప్రజలు సహకరించి, క‌రోనా క‌ట్ట‌డిలో భాగం కావాల‌ని కోరారు.

Aslo Read :

తమ్ముని పేరుతో అన్న ప్ర‌భుత్వ ఉద్యోగం, ఏకంగా 12 ఏళ్లు

కడపజిల్లాలో ఎస్ఐ సాహసం, ప్రాణాల‌కు తెగించి