హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కమెడియన్ సత్య… ఆకటుకుంటున్న ‘వివాహ భోజనంబు’ టీజర్.!!

హాస్య నటుడు సత్య హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అతడు కథానాయకుడిగా నటించిన సినిమా 'వివాహ భోజనంబు'...

హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కమెడియన్ సత్య... ఆకటుకుంటున్న వివాహ భోజనంబు టీజర్.!!
Vivaha Bhojanmbu

Updated on: Dec 18, 2020 | 9:01 PM

Vivaha Bhojanambu Teaser: హాస్య నటుడు సత్య హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అతడు కథానాయకుడిగా నటించిన సినిమా ‘వివాహ భోజనంబు’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్జావీ రాజ్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నెల్లూరు ప్రభ అనే ప్రత్యేక పాత్రలో ప్రముఖ యువ హీరో సందీప్ కిషన్ నటించారు.

టీజర్ బట్టి కరోనా నేపథ్యంలో పెళ్లి చేసుకున్న ఓ యువకుడి కథతో రూపొందిన వినోదాత్మక చిత్రమిది అని అర్థమవుతోంది. వినోదాల విందుకు ఏమాత్రం లోటు లేదని తెలుస్తోంది. వాస్తవ సంఘటనల ప్రేరణతో సినిమాను తెరకెక్కించామని చిత్రబృందం టీజర్‌లో పేర్కొంది. కథానాయకుడిగా సత్య అద్భుతంగా నటించాడనీ యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ చిత్రానికి అనిరుద్ విజయ్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. జనవరి 1 నుంచి ఉచిత బస్సు పాసులు..

‘చాయ్’ ప్రియులకు అలెర్ట్.. పేపర్ కప్పుల్లో తాగుతున్నారా.! ఆరోగ్యానికి ఇబ్బందేనంటున్న పరిశోధకులు..

‘మాస్టర్’ తెలుగు టీజర్ వచ్చేసింది.. విజయ్ స్క్వేర్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కు పండగే..

విద్యార్థులకు మోదీ సర్కార్ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తోందా.? వైరల్ అవుతున్న మెసేజ్.. వివరణ ఇచ్చిన కేంద్రం..

Loading...
Unable to load recommendations.
Follow Us