సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్.. ఇంజనీర్లు, అధికారులతో రివ్యూ మీటింగ్

|

Dec 13, 2020 | 8:31 PM

సీఎం జగన్ సోమవారం ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ, ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సోమవారం ఉదయం 10.25నిమిషాలకు హెలికాప్టర్​లో ముఖ్యమంత్రి​ పోలవరం చేరుకుంటారు.

సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం జగన్.. ఇంజనీర్లు, అధికారులతో రివ్యూ మీటింగ్
Follow us on

సీఎం జగన్ సోమవారం ఆంధ్రప్రదేశ్ జీవనరేఖ, ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సోమవారం ఉదయం 10.25నిమిషాలకు హెలికాప్టర్​లో ముఖ్యమంత్రి​ పోలవరం చేరుకుంటారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను గంటపాటు పరిశీలిస్తారు. 12 గంటలకు పోలవరం ప్రాజెక్టు మీటింగ్ హాల్‌లో ఇంజినీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమై రివ్యూ నిర్వహిస్తారు.  మధ్యాహ్నం ఒకటిన్నరకు పోలవరం నుంచి హెలికాప్టర్​లో బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం పర్యటన సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలలో  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అటు పోలవరం ఎత్తును కూడా ఒక్క అంగుళం కూడా తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

ఇప్పటివరకూ పోలవరం ప్రాజెక్టు  నిర్మాణాన్ని పరిశీలిస్తే..స్పిల్ వేకు సంబంధించి 2 లక్షల 17 వేల 443 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ పూర్తయ్యింది. స్పిల్ వే పిల్లర్లపై 160 గడ్డర్లను 52 మీటర్ల ఎత్తులో నిర్మించారు. గేట్ల ఏర్పాటులో కీలకమైన 48 ట్రూనియన్ భీంలలో..30 ట్రూనియన్ భీమ్‌ల నిర్మాణం పూర్తయింది. కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా స్పిల్ ఛానల్ లో  లక్షా 10 వేల 33 క్యూబిక్ మీటర్ల పని పూర్తిచేశారు.

Also Read :

Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు

Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్‌పై షాకింగ్ కామెంట్స్

కొండంత ట్రాఫిక్..శ్రీశైలంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న భక్తులు..5 కిలోమీటర్ల మేర జామ్

లాక్‌డౌన్ సమయంలో చెక్‌పోస్టుల వద్ద గంజాయి స్మగ్లర్లతో స్నేహం, ఆపై ఏఆర్ కానిస్టేబుల్ ఏం చేశాడంటే