ఎస్సై పేరిట ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్..ఇక చూస్కోండి !

|

Sep 16, 2020 | 11:34 AM

తస్మాత్ జాగ్రత్త..సమాయంలో మాయగాళ్లు, మోసగాళ్లు పెరిగిపోతున్నారు. ఎటునుంచి ఎవరు వచ్చి మన డబ్బు కొల్లగొడతారో తెలీదు.

ఎస్సై పేరిట ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్..ఇక చూస్కోండి !
Follow us on

తస్మాత్ జాగ్రత్త..సమాయంలో మాయగాళ్లు, మోసగాళ్లు పెరిగిపోతున్నారు. ఎటునుంచి ఎవరు వచ్చి మన డబ్బు కొల్లగొడతారో తెలీదు. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. తాజాగా ఎస్సై పేరు మీద ఫేక్ ఫేస్‌బుక్‌ అకౌంట్ సృష్టించి… రూ.లక్ష మేర హెడ్‌ కానిస్టేబుల్‌ను బురిడీ కొట్టించిన ఘటన అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. సిటీగార్డ్స్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా వర్క్ చేసిన ఇసుకపల్లి బాలగురుప్రసాద్‌రెడ్డికి ఈ నెల 11న తనకు బాగా తెలిసిన జయన్న అనే ఎస్సై‌ పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ ఐడీ నుంచి మెసేజ్ వచ్చింది. ఆయనతో కాసేపు గురుప్రసాద్‌రెడ్డి ఛాటింగ్‌ చేశారు.

తనకు డబ్బు అర్జంట్ అవసరముందని, రూ.లక్ష పంపితే… సాధ్యమైనంత త్వరగా తిరిగిచ్చేస్తానని ఎదుటి వ్యక్తి బ్యాంకు అకౌంట్ వివరాలు పంపాడు. డబ్బు పంపేందుకు సిద్ధమైన గురుప్రసాద్‌రెడ్ఢి… ఒకసారి మాట్లాడదామని ఎస్సైకి ఫోన్‌ చేయగా, నెంబర్ వర్క్ అవ్వలేదు. అయినా… తనకు బాగా  పరిచయమున్న ఎస్సై అయ్యేసరికి రూ.లక్షను రెండు దఫాలుగా ఆన్‌లైన్‌లో పంపాడు. కొద్దిసేపటి తర్వాత రూ.లక్ష అందాయా లేదో అని తెలుసుకునేందుకు ఎస్సై జయన్నకు ఫోన్‌ చేయగా, చాట్ చేసింది తాను కాదంటూ ఆయన సమాధానమిచ్చాడు. జరిగిన విషయాన్ని గురుప్రసాద్‌రెడ్డి చెప్పగా.. ఎవరో తన పేరు, ఫొటోతో ఫేక్ ఫేస్‌బుక్‌ ఐడీ తయారుచేసి, మోసాలకు పాల్పడుతున్నాడంటూ చెప్పారు. తాను మోసపోయానని తెలుసుకున్న హెడ్‌కానిస్టేబుల్‌…  ఎస్సై జయన్న సూచనల మేరకు… పూర్తి వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

Aslo Read :

విషాదం : భారత మాజీ క్రికెట‌ర్ మృతి

 టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ రావు కన్నుమూత