రైతులకు జగన్ సర్కార్ మరిన్ని వరాలు, ఉచితంగానే మోటార్లు, పంపు సెట్లు

|

Oct 09, 2020 | 6:00 PM

రైతులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది.  వైఎస్ఆర్ జల కళ పథకంలో భాగంగా ఉచిత బోర్లతో పాటు పంపుసెట్లు, మోటార్లను కూడా ఉచితంగానే అమర్చాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

రైతులకు జగన్ సర్కార్ మరిన్ని వరాలు, ఉచితంగానే మోటార్లు, పంపు సెట్లు
Follow us on

రైతులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది.  వైఎస్ఆర్ జల కళ పథకంలో భాగంగా ఉచిత బోర్లతో పాటు పంపుసెట్లు, మోటార్లను కూడా ఉచితంగానే అమర్చాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈమేరకు జలకళ పథకంలో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు ఉచితంగా బోర్లు తవ్వటంతో పాటు చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగానే పంపుసెట్లు, మోటార్లు బిగించాలని అధికారులను ఆదేశించింది. జలకళ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోర్లకు, మోటార్లు, పంపుసెట్లు, ఇతర పరికరాలను ఉచితంగానే బిగించాలని అధికారులకు సూచించింది. అటు ఉచితంగానే విద్యుత్ కనెక్షన్ ను కూడా అమర్చాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బోర్లలోతు, భూమి రకం, ఎంతమేర పంట సాగవుతోందన్న అంశాల ఆధారంగా పంపుసెట్లు, మోటార్లను బిగించాలని నిర్ణయించింది. ఈమేరకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read :

 ఏపీలో కోవిడ్ నిబంధనల్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ 

ఇవి షోరూం బండ్లు కాదు, అన్నీ కొట్టేసినవే !

Bigg Boss Telugu 4: ఫన్‌లోనూ, పారితోషకంలోనూ ఇతడే టాప్ !