ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటాన్ని సహించలేకనే: జేసీ అరెస్ట్‌పై బాబు ఫైర్

వైసీపీ ఏడాది వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ నేతలపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని ఆ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు అన్నారు.

ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటాన్ని సహించలేకనే: జేసీ అరెస్ట్‌పై బాబు ఫైర్
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2020 | 9:11 AM

వైసీపీ ఏడాది వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ నేతలపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని ఆ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి అరెస్ట్‌లను ఖండించిన ఆయన.. జగన్ ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటాన్ని జగన్ సహించలేకపోతున్నారని విమర్శించారు. జగన్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నిన్న అచ్చెన్నాయుడు, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్‌ చేశారని బాబు తూర్పారబట్టారు.

టీడీపీ నేతలను జగన్.. శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా ఇబ్బందులు పెడుతున్నారని, ఇష్టారాజ్యంగా తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. తాను జైలుకు వెళ్లానన్న అక్కసుతో ఇతరులను జైళ్లకు పంపాలని జగన్ కక్ష పెంచుకున్నారని దుయ్యబట్టారు. ప్రతీకారేచ్ఛతో జగన్ రాష్ట్రాన్ని పతనం చేస్తున్నారని.. కక్ష సాధింపు చర్యలతో తెలుగుదేశం పార్టీని ప్రజలనుంచి దూరం చేయలేరని పేర్కొన్నారు. ఇకపై రెట్టించిన బలంతో ప్రజా సమస్యలపై పోరాడతామని, అన్నివర్గాల ప్రజలకు అండగా ఉండి.. వైసీపీ ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడతామని బాబు వివరించారు. ప్రజల అండదండలే టిడిపి నేతలకు ఆశీస్సులని.. వైసీపీ దుశ్చర్యలను ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులు, అన్నివర్గాల ప్రజలు ఖండించాలని బాబు కోరారు.

Read This Story Also: చైనా రాజధానిలో కరోనా కలకలం.. 55 రోజుల తరువాత..!