రాజధాని రైతులపై చంద్రబాబు ప్రశంసల జల్లు

|

Oct 13, 2020 | 4:09 PM

గత 300 రోజులుగా రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు పోరాడుతున్న రైతాంగాన్ని పొగడ్తలతో ముంచెత్తారు టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత చంద్రబాబు. పార్టీ క్యాడర్‌తో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్లు చేశారు.

రాజధాని రైతులపై చంద్రబాబు ప్రశంసల జల్లు
Follow us on

Chandrababu appreciates capital farmers: గత 300 రోజులుగా రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు పోరాడుతున్న రైతాంగాన్ని పొగడ్తలతో ముంచెత్తారు టీడీపీ అధినేత, ఏపీ విపక్ష నేత చంద్రబాబు. రాజధాని రైతుల పట్టుదల అభినందనీయమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడా ఇంతటి పట్టుదలతో కూడా పోరాటాన్ని తాను చూడలేదని ఆయనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగితేనే.. ప్రత్యేక ఒప్పందానికి లోబడి రాజధాని రైతాంగం భూములిచ్చిందని ఆయన తెలిపారు. ఇపుడు వారికి అన్యాయం చేయడం తగదని ఆయన ఏపీ ప్రభుత్వానికి సూచించారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన 175 నియోజకవర్గాల అభ్యర్ధులు, ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు మంగళవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని మరీ భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయడం బ్రీచ్ ఆఫ్ ట్రస్టు కిందకే వస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని రైతాంగానికి సంఘీభావం ప్రకటించిన రాజకీయ పార్టీలకు, నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడం ఓ దుష్పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం పని చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ వేగవంతం చేయాలనే ఆదేశాలు నాలుగేళ్ళ నాటివని, వాటిని ఇపుడు అమలు చేస్తున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Also read: చంద్రబాబుకు నోటీసిచ్చిన తహసీల్దార్

Also read: ప్రభుత్వంపై కోర్టుకెక్కిన సినీ నిర్మాత

Also read: ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీలు