ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రిఫరల్ ఆస్పత్రి..

|

Jun 27, 2020 | 4:34 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యఆరోగ్య వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేదిశగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు.

ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రిఫరల్ ఆస్పత్రి..
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యఆరోగ్య వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేదిశగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగానే ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రిఫరల్ ఆస్పత్రిని రోగుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ఏపీలో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స ప్రజలకు అందుబాటులోకి రానుంది. గుంటూరు జీజీహెచ్‌లొ రూ. 33 కోట్లతో కొత్త క్యాన్సర్ విభాగాన్ని నాట్కో ట్రస్ట్ నిర్మించగా.. అత్యాధునిక పరికరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 17 కోట్లు ఇచ్చింది. జూలై 1న ముఖ్యమంతి జగన్ ఈ ఆస్పత్రిని ప్రారంభించనుండగా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రోగులకు ఇకపై ఉచితంగా సేవలు అందనుండగా.. ఏపీలో తొలిసారిగా క్యాన్సర్ రిఫరల్ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి:

రాజధానిలో ర్యాపిడ్ టెస్ట్‌లు: ఐసీఎంఆర్ అనుమతి

రోడ్డు ప్రమాదం: చిరంజీవి చిన్ననాటి స్నేహితుడి కుటుంబం దుర్మరణం

గుడ్‌న్యూస్: కేబుల్‌ టీవీ, డీటీహెచ్ బిల్లుల తగ్గింపుకు ట్రాయ్ కొత్త యాప్