హైదరాబాద్‌ గ్రిడ్‌ పాలసీకి కేబినెట్‌ ఆమోదం.. ఐటీ పరిశ్రమల విస్తరణ!

| Edited By:

Aug 06, 2020 | 1:26 PM

కరోనా సంక్షోభ కాలంలో కూడా హైదరాబాద్ నుంచి భారీగా ఐటీ ఎగుమతులు నమోదయ్యాయి. ఈ క్రమంలో నిన్న జరిగిన మంత్రివర్గ భేటీలో రాజధాని‌లో ఐటీ పరిశ్రమలు ఒకేచోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు

హైదరాబాద్‌ గ్రిడ్‌ పాలసీకి కేబినెట్‌ ఆమోదం.. ఐటీ పరిశ్రమల విస్తరణ!
Follow us on

కరోనా సంక్షోభ కాలంలో కూడా హైదరాబాద్ నుంచి భారీగా ఐటీ ఎగుమతులు నమోదయ్యాయి. ఈ క్రమంలో నిన్న జరిగిన మంత్రివర్గ భేటీలో రాజధాని‌లో ఐటీ పరిశ్రమలు ఒకేచోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఐటీ పరిశ్రమల కారిడార్‌గా పేరొందిన పశ్చిమ ప్రాంతంలో మినహా ఇతర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రతిపాదిత హైదరాబాద్‌ గ్రిడ్‌ పాలసీని కేబినెట్‌ ఆమోదించింది.

హైదరాబాద్‌ గ్రిడ్‌ పాలసీలో భాగంగా.. నగరానికి దక్షిణాన విమానాశ్రయం, శంషాబాద్, ఆదిభట్ల, ఉత్తరాన కొంపల్లి, పరిసర ప్రాంతాలు, తూర్పున ఉప్పల్, పోచారం, వాయవ్యంలో (నార్త్‌వెస్ట్‌), కొల్లూరు, ఉస్మాన్‌నగర్‌తో పాటు పశ్చిమ కారిడార్‌ వెలుపలి ఇతర ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి ఈ పాలసీని ప్రభుత్వం తెచ్చింది. 2019–20లో హైదరాబాద్‌ 18 శాతం వృద్ధి రేటుతో రూ.1,18,000 కోట్ల ఐటీ ఎగుమతులను సాధించగా, ఇందులో 90 శాతం పశ్చిమ కారిడార్‌ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, వీటి పరిసర ప్రాంతాల నుంచే వచ్చాయి.

Read More:

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!

దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ!