Butter Tea: మీరు బట్టర్ టీ ఎప్పుడైనా తాగారా.. వైరల్ అవుతున్న వీడియో..

|

Jan 20, 2022 | 8:48 PM

ఈ దేశంలో దాదాపు అందరూ టీ ప్రేమికులే. వారు ప్రతి వీధి, సందు, మూలల్లో గొప్ప ఉత్సాహంతో టీని రుచి చూస్తారు...

Butter Tea: మీరు బట్టర్ టీ ఎప్పుడైనా తాగారా.. వైరల్ అవుతున్న వీడియో..
Butter Tea
Follow us on

ఈ దేశంలో దాదాపు అందరూ టీ ప్రేమికులే. వారు ప్రతి వీధి, సందు, మూలల్లో గొప్ప ఉత్సాహంతో టీని రుచి చూస్తారు. టీని జాతీయ పానీయంగా పిలిస్తే తప్పులేదు. అయితే టీ ఒక్కో చోట రుచి వేరుగా ఉంటుంది. అలాగే వివిధ రకాల టీలు కూడా ఉంటాయి. సాధారణంగా, టీ చేయడానికి పాలు, చక్కెర, చపత్త, అల్లం అవసరమవుతాయి. కానీ ఓ చోట టీలో వెన్న కలుపుతూ టీ తయారు చేస్తున్నారు. టీలో వెన్న కలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోపై ప్రజలు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఓ వినియోగదారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు . లక్షలాది మంది దీన్ని వీక్షించగా, వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు.

Read Also..  Viral Photo: ఈ ఫోటో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే.. మీ కళ్లలో పదునున్నట్లే.!