Botsa offer చంద్రబాబుకు బొత్స బంపర్ ఆఫర్

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదే సమయంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుపడుతున్న చంద్రబాబుపై బొత్స ధ్వజమెత్తారు.

Botsa offer చంద్రబాబుకు బొత్స బంపర్ ఆఫర్
Follow us

|

Updated on: Apr 01, 2020 | 12:22 PM

Botsa Satyanarayana gives bumper offer to Chandrababu: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదే సమయంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుపడుతున్న చంద్రబాబుపై బొత్స ధ్వజమెత్తారు. చంద్రబాబు కొన్నాళ్ళ పాటు మౌనం పాటిస్తే మంచిదని ఉచిత సలహా కూడా ఇచ్చేశారు బొత్స సత్యనారాయణ.

తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో బొత్స బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అదే క్రమంలో విపక్ష నేత చంద్రబాబుకు బొత్స బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ కూర్చునే బదులుగా చంద్రబాబు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా టెస్ట్ చేయించుకోవాలని బంపర్ ఆఫర్ ఇచ్చేశారు బొత్స. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తూనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బొత్స వివరించారు.

లాక్ డౌన్ కారణంగా రేషన్ వస్తువులను ప్యాక్ చేయలేకపోయామని, అందుకే ఇంటింటికీ సరఫరా చేయడం లేదని చెబుతున్నారు బొత్స. కానీ.. లాక్ డౌన్ ముగిసే దాకా రేషన్ పంపిణీ కొనసాగుతుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతి రోజు కరోనా వైరస్ వ్యాప్తిపై సమీక్ష నిర్వహిస్తున్నారని, ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి నుండి ఎక్కువగా కరోనా వ్యాపించిందని తెలుస్తుందని బొత్స తెలిపారు. లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ పస్తు ఉండకూడదని సీఎం ఆదేశించారని మంత్రి చెప్పారు. అందుకే లాక్ డౌన్ ముగిసే దాకా రేషన్ సరఫరా వుంటుందని క్లారిటీ ఇచ్చారాయన.

రాష్ట్రంలో 900 రైతుబజారులతో పాటు…. 1500 మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేశామని, ప్రతి ఇంటిని సర్వెలెన్స్‌లో ఉంచామని, క్వారంటైన్ ఆసుపత్రిలో సుమారుగా 2000 బెడ్స్ ఏర్పాటు చేశామని వివరించారు బొత్స. ప్రైవేట్ ఆసుపత్రులు, హాస్టళ్లు అన్నిటిని ప్రభుత్వం సిద్దం చేసిందని, రైతుల గిట్టుబాటు ధరలపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

ప్రభుత్వం దృష్టి కి వచ్చిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, కానీ కొందరు పెద్ద మనుషులు హైదరాబాద్‌లో కూర్చుని విమర్శలు చేస్తున్నారంటూ విపక్ష నేత చంద్రబాబుపై పరోక్షంగా కామెంట్ చేశారు బొత్స. చంద్రబాబు స్వచ్ఛందంగా కరోనా టెస్టులు చేయించుకోవాలని బొత్స అంటున్నారు. చంద్రబాబు చౌకబారు ఆరోపణలు మానుకోవాలని బొత్స సూచించారు.