Bird Flu Confirmed : మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ వైరస్.. తాజాగా సౌత్ ఇండియాను తాకింది..

|

Jan 04, 2021 | 8:07 PM

కరోనా మహమ్మారితో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో షాకింగ్ మరింత వణికిస్తోంది. బర్డ్‌ఫ్లూ రోజు రోజుకు మరింత వేగంగా విస్తరిస్తోంది. రాజస్థాన్‌ నుంచి బర్డ్‌ఫ్లూ మధ్యప్రదేశ్‌కు విస్తరించిన ఈ మహమ్మారి ఇప్పుడు తాజాగా కేరళను తాకింది...

Bird Flu Confirmed : మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాలను భయపెడుతున్న బర్డ్ ఫ్లూ వైరస్.. తాజాగా సౌత్ ఇండియాను తాకింది..
Follow us on

Bird Flu Confirmed : కరోనా మహమ్మారితో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో షాకింగ్ మరింత వణికిస్తోంది. బర్డ్‌ఫ్లూ రోజు రోజుకు మరింత వేగంగా విస్తరిస్తోంది. రాజస్థాన్‌ నుంచి బర్డ్‌ఫ్లూ మధ్యప్రదేశ్‌కు విస్తరించిన ఈ మహమ్మారి ఇప్పుడు తాజాగా కేరళను తాకింది. అక్కడి అళపుజ, కొట్టాయం జిల్లాలో కొన్ని పక్షుల్లో వైరస్ ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. గత వారం అధికారులు పక్షుల శాంపిళ్లను పరీక్షల కోసం భోపాల్‌కు పంపించగా వాటిలో హెచ్5ఎన్8 వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. నీందూర్ అనే ప్రాంతంలో ఏకంగా 1500 బాతులు మరణించాయని అధికారులు చెప్పారు. ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు పాకకుండా ఉండేందుకు ఈ ప్రాంతం చుట్టూ కిలోమీటర్ పరిధిలో ఉన్న అన్ని పక్షులన్ని చంపేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే 12 వేల బాతులు మరణించాయని.. ముందు జాగ్రత్త కోసం మరో 36 వేల పక్షుల్నీ చంపేయాల్సి రావచ్చొని వారు పేర్కొన్నారు..

బర్డ్‌ఫ్లూ సోకిన ప్రాంతాల్లో ప్రజలకు కూడా వైద్యపరీక్షలు చేస్తున్నారు. బర్డ్‌ఫ్లూ ప్రబలిన ప్రాంతాల్లో జలుబు,దగ్గు , జ్వరంతో బాధపడుతున్న వాళ్లకు ప్రత్యేక వైద్యపరీక్షలు చేస్తున్నారు. అలాంటి వాళ్ల శాంపిళ్లను కచ్చితంగా పరీక్షించాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. పక్షుల నుంచి మనుషులకు సోకే బర్డ్‌ఫ్లూ అత్యంత ప్రమాదకరమని నిర్ధారించారు. పక్షులు ఎక్కువగా చనిపోయిన చోట అందుకే వెంటనే నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. కోళ్లతో పాటు ఇతర పక్షులను ఆ ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా సంహరిస్తున్నారు.

అయితే భారత్‌ మందుగా ఈ వైరస్‌ను ఇండోర్‌లో గుర్తించిన సంగతి తెలిసిందే. బర్డ్ ఫ్లూతో 100కు పైగా కాకులు చనిపోయాయి. చనిపోయిన కాకులకు బర్డ్‌ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా అలర్ట్‌ ప్రకటించారు. కాకులతో ఈ వ్యాధి విస్తరించే ప్రమాదముందని హెచ్చరించారు. బర్డ్‌ఫ్లూ కలకలతో ఇండోర్‌ నగరం పరిధిలో ఐదు కిలోమీటర్ల మేర కర్ఫ్యూ విధించారు. బర్డ్‌ఫ్లూ సోకిన పక్షులను గుర్తించడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. రాజస్థాన్‌ లోని ఝల్వార్‌లో బర్డ్‌ఫ్లూ కేసులు బయటపడ్డాయి. ఝల్వార్‌లో బర్డ్‌ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి…

Ration Door Delivery : ఫిబ్రవరి 1 నుంచి ఇంటికే రేషన్ బియ్యం.. నిత్యావసర సరుకుల పంపిణీ కోసం ప్రత్యేక వాహనాలు..
Share Market News Today : దేశీయ మార్కెట్లలో సరికొత్త రికార్డ్స్.. మెటల్స్ మెరుపులు.. ఆటో రంగాల దూకుడు..

 

 

 

.