Bird Flu Cases: మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ… అధికారికంగా ప్రకటించిన కేంద్రం..

|

Jan 28, 2021 | 2:53 PM

Bird Flu Spread To Few More Places: కరోనా మహమ్మారికి ఇప్పుడిప్పుడే చెక్ పడుతుందని అంతా సంతోషిస్తున్న సమయంలోనే బర్డ్ ఫ్లూ పేరుతో మరో వైరస్ మానవాళిపైకి దూసుకొచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పక్షులు...

Bird Flu Cases: మరికొన్ని ప్రాంతాలకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ... అధికారికంగా ప్రకటించిన కేంద్రం..
Bird Flu
Follow us on

Bird Flu Spread To Few More Places: కరోనా మహమ్మారికి ఇప్పుడిప్పుడే చెక్ పడుతుందని అంతా సంతోషిస్తున్న సమయంలోనే బర్డ్ ఫ్లూ పేరుతో మరో వైరస్ మానవాళిపైకి దూసుకొచ్చింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పక్షులు, కోళ్లు, నెమళ్లు ఆకస్మాత్తుగా మరణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇదిలా ఉంటే తాజాగా బర్డ్ ఫ్లూ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందన్న సందర్భంలో కేంద్రం చేసిన ప్రకటన మరోసారి ఉలిక్కి పడేలా చేసింది. తాజాగా ఈ వైరస్ మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లోని పౌల్ట్రీ కోళ్లకు బర్డ్‌ప్లూ విస్తరించినట్లు తెలిపారు. మహారాష్ట్రలోని.. నాసిక్, అకోల, బుల్ధానా, అహ్మద్‌నగర్, పుణె, సోలాపుర్, హింగోలి జిల్లాలతో పాటు గుజరాత్‌లోని భావనగర్ జిల్లా, ఛత్తీస్‌గఢ్‌లోని ధంతరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా.. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌ అటవీ డివిజన్‌, గుజరాత్‌ రాష్ట్రం జునాగఢ్‌లోని తీతర్‌ కాకుల్లో ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో నెమళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది.

Also Read: కుక్కను బతికించా.. చెల్లి ఆత్మనీ రప్పిస్తా.. హరర్‌ మూవీని తలపిస్తున్న మదనపల్లె కేసు..