‘నొప్పిలేకుండా చావు’.. చనిపోయే ముందు సుశాంత్ గూగుల్‌లో వెతికాడు!

|

Aug 03, 2020 | 11:53 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ చనిపోయే ముందు మూడు అంశాల గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసినట్లు ముంబై పోలిస్ అధికారి ఒకరు వెల్లడించారు.

నొప్పిలేకుండా చావు.. చనిపోయే ముందు సుశాంత్ గూగుల్‌లో వెతికాడు!
Follow us on

Sushant Singh Rajput Google Search: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ చనిపోయే ముందు మూడు అంశాల గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసినట్లు ముంబై పోలిస్ అధికారి ఒకరు వెల్లడించారు. తన పేరుతో ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని వార్తలతో పాటు, మాజీ మేనేజర్ దిశాకు సంబంధించిన విషయాలను శోధించడమే కాకుండా.. ఈ ఘటనలో తనపై ఎలాంటి వార్తలు వచ్చాయి.?, ‘పెయిన్‌లెస్ డెత్’కు సంబంధించిన ఆర్టికల్స్‌ను సుశాంత్ ఎక్కువగా సెర్చ్ చేశాడని ఆ అధికారి వెల్లడించారు.

జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న కొన్ని గంటలకు ముందు సుశాంత్ అతని పేరునే గూగుల్ చేశాడని.. ఈ విషయాలన్నీ కూడా తన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ ద్వారా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డాయని పోలీస్ ఆఫీసర్ తెలిపారు. అటు సుశాంత్ బ్యాంక్ ఖాతాల వివరాలను కూడా పరిశీలించిన పోలీసులు గతేడాది జీఎస్టీ కోసం పెద్ద మొత్తంలో రూ. 2.8 కోట్లు బదిలీ అయినట్లు గుర్తించారు. ఇక ఈ కేసులో ముంబై పోలీసులు ఇప్పటివరకు 40 మందికి పైగా ప్రముఖుల స్టేట్‌మెంట్స్‌ను నమోదు చేశారు.

”తన మాజీ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్యతో తన పేరును జోడించడం వల్ల సుశాంత్ కలత చెందాడని.. అందుకే అతను ఆ సమయంలో ఎక్కువగా ఈ మూడింటి గురించే ఆన్లైన్‌లో సెర్చ్ చేశాడని ఆఫీసర్ చెప్పుకొచ్చాడు. వీటి వల్లే అతడు మరింతగా డిప్రెషన్‌లో వెళ్లి ఉండొచ్చని కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారి వివరించారు.

Also Read:

 సుశాంత్ మరణం వెనుక రహస్యాలు.. షాకింగ్ నిజాలు.. వైరల్ వీడియో..

Part 3: ”సుశాంత్‌ది హత్యేనా” ఆత్మ ఏం చెప్పింది.? షాకింగ్ వాస్తవాలు…