వరుసగా 6 రోజులు బ్యాంకు సేవలు బంద్..చూస్కోండి..!

|

Feb 22, 2020 | 8:26 AM

మార్చి నెలలో వరసగా 6 రోజులపాటు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. వేతనాలు పెంపును కోరుతూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ)... మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజుల దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.

వరుసగా 6 రోజులు బ్యాంకు సేవలు బంద్..చూస్కోండి..!
Follow us on

మార్చి నెలలో వరసగా 6 రోజులపాటు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. వేతనాలు పెంపును కోరుతూ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌ఐ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ)… మార్చి 11 నుంచి 13 వరకు మూడు రోజుల దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. అయితే మార్చి 10 వ తేదీన హోలీ కావడంతో ఆ రోజు కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక మార్చి 14 రెండవ శనివారం, మార్చి 15 ఆదివారం బ్యాంకులకు యధావిదిగా హాలి డేస్ ఉండనున్నాయి. దీంతో వరుసగా 6 రోజులపాటు బ్యాంకుల సేవలకు ఆటంకం కలగనుంది.  ఈ ప్రభావంతో మార్చి రెండవ వారంలో కేవలం 9వ తేదీన మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. కాగా 20 శాతం వేతనాలు పెంచాలని ఎంప్లాయిస్ యూనియన్లు డిమాండ్ చేస్తుంటే, 12. 5 శాతం పెంచేందుకు బ్యాంకు యాజమాన్యాలు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై కేంద్ర లేబర్ కమిషనర్ వద్ద మరోసారి చర్చలు జరగునున్నాయి. ఇవి సఫలీకృతం అయితే బ్యాంకు కష్టమర్లకు స్వాంతన కలిగే అవకాశం ఉంది. 

ఇది కూడా చదవండి : టీడీపీ నేత రాయపాటికి షాక్..ఆస్తుల వేలానికి రంగం సిద్దం..