Space Saloon: స్పేస్ స్టేషన్‎లో హేయిర్ కటింగ్.. వైరల్ అయిన వీడియో..

|

Dec 22, 2021 | 8:00 PM

స్పేస్ స్టేషన్‎లో వెళ్లడం గొప్ప అనుభూతిగా ఉంటుంది. కానీ ఓ వ్యక్తి స్పేస్ స్టేషన్‎లో కటింగ్ తీసుకున్నారు...

Space Saloon: స్పేస్ స్టేషన్‎లో హేయిర్ కటింగ్.. వైరల్ అయిన వీడియో..
Hair Cutting
Follow us on

స్పేస్ స్టేషన్‎లో వెళ్లడం గొప్ప అనుభూతిగా ఉంటుంది. కానీ ఓ వ్యక్తి స్పేస్ స్టేషన్‎లో కటింగ్ తీసుకున్నారు. అతనే వ్యోమగామి మాథియాస్ మౌరర్. అతని కటింగ్ తీసుకున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. తనకు స్పేస్ స్టేషన్‌లో క్రూమేట్ రాజా చారి నుంచి హెయిర్‌కటింగ్ చేశారని చెప్పుకొచ్చారు. ఈ వీడియోలో మౌరర్ జుట్టును ట్రిమ్మర్‌తో రాజా చారి కత్తిరించాడు. ఈ చమత్కారమైన ట్వీట్‌లో మౌరర్ చారిని ప్రతిభ ఉన్న వ్యక్తి అని కామెంట్ చేశాడు.

డిసెంబర్ 19న షేర్ చేసిన వీడియోకి ఇప్పటి వరకు 29,000 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. ” భూమిలో చాలా తేలికైన విషయాలు అంతరిక్షంలో కొంచెం కష్టంగా ఉంటాయి.” అని కొందరు కామెంట్ చేశారు. మరొకరు కూడా “NASA’s స్పేస్ సెలూన్” అని చమత్కరించారు. ఈ సంవత్సరం ఆగస్టులో, ఫ్రెంచ్ వ్యోమగామి థామస్ పెస్క్వెట్ వ్యోమనౌకలో తోటి వ్యోమగాములతో కలిసి పిజ్జాను ఆస్వాదిస్తున్న క్లిప్‌ను పోస్ట్ చేశారు.

Read Also.. Viral Video: గాలిపటంతో పాటే గాల్లోకి ఎగిరిపోయాడు.. 30 అడుగుల ఎత్తులో వేలాడాడు.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..