Panchayat Elections Rescheduled: ఏపీ పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్‌ఈసీ.. ఈనెల 29నుంచి మొదటి దశ నామినేషన్ల స్వీకరణ

|

Jan 25, 2021 | 4:04 PM

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్‌ఈసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధం కానందున..

Panchayat Elections Rescheduled: ఏపీ పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేసిన ఎస్‌ఈసీ.. ఈనెల 29నుంచి మొదటి దశ నామినేషన్ల స్వీకరణ
Follow us on

Panchayat Elections Rescheduled: ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్‌ఈసీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధం కానందున రీ షెడ్యూల్ చేస్తున్నామని ఎస్‌ఈసీ తెలిపింది. ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో ఎన్నికల నిర్వహణ ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ లో మార్పులు చేసింది. రెండో దశ ఎన్నికలను మొదటి దశగా ఎన్నికలుగా .. మూడో దశ ఎన్నికలను రెండో దశ ఎన్నికలుగా .. నాలుగో దశ ఎన్నికలను మూడో దిశగాను మొదటి దశలో జరగాల్సిన ఎన్నికలను నాలుగో దశలో జరిగేటట్లు ఎస్‌ఈసీ రీ షెడ్యూల్ చేసి జిల్లా కలెక్టర్లకు పంపింది. మొదటి ఎన్నికలకు ఈ నెల 29 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులను తక్షణమే కలెక్టర్లు నియమించాలని ఆదేశాలు జారీ చేసింది,

మరోవైపు సుప్రీం కోర్టు తీర్పును అధ్యయనం చేసిన తర్వాతే స్పందిస్తామని ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పును టీడీపీ , సీపీఐ నేతలు స్వాగతించారు.

Also Read: భారత్ అందానికి.. మనిషి నిర్లక్ష్యానికి ప్రతీక ఈ రెండు ఫోటోలు అంటున్న నటి కవితా కౌశిక్