India & Indians Described 2 Pics: భారత్ అందానికి.. మనిషి నిర్లక్ష్యానికి ప్రతీక ఈ రెండు ఫోటోలు అంటున్న నటి కవితా కౌశిక్

బుల్లి తెర ఫేమస్ నటి కవితా కౌశిక్ ఆదివారం సోషల్ మీడియా ద్వారా రెండు ఫోటోలను షేర్ చేశారు. ఈ రెండు చిత్రాలను చూడడండి.. ఇవి మన దేశం..  మన దేశ ప్రజల నడవడికకు గుర్తు అంటూ...

India & Indians Described 2 Pics: భారత్ అందానికి.. మనిషి నిర్లక్ష్యానికి ప్రతీక ఈ రెండు ఫోటోలు అంటున్న నటి కవితా కౌశిక్
Follow us

|

Updated on: Jan 25, 2021 | 2:36 PM

India & Indians Described 2 Pics: బుల్లి తెర ఫేమస్ నటి కవితా కౌశిక్ ఆదివారం సోషల్ మీడియా ద్వారా రెండు ఫోటోలను షేర్ చేశారు. ఈ రెండు చిత్రాలను చూడడండి.. ఇవి మన దేశం..  మన దేశ ప్రజల నడవడికకు గుర్తు అంటూ ఓ కామెంట్ ను జత చేశారు. ఒక ఫోటో కొండాకోనల నడుమ సూర్యోదయం,  ప్రకృతి అందాలతో కనువిందు చేసే భారత దేశాన్ని మనకు పరిచయం చేస్తుంది. అది సుందరమైన భారత దేశ దృశ్యానికి ప్రతీకగా నిలిచింది. మరొక ఫోటో కొండలలో వేయబడిన ప్లాస్టిక్ , గాజు సీసా వ్యర్ధాలను చూపిస్తూ ప్రకృతి పట్ల మనిషి నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచింది.

ఈ రెండు చిత్రాల్లో మొదటి చిత్రం భారతదేశం అయితే.. రెండో ఫోటో భారతీయులు అంటూ రెండు చిత్రాలలో వర్ణించారు కవితా. ఈ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది నిజంగా బాధాకరమైంది.. ఎంత అవగాహన కలిగించినా చెత్త నిర్వహణకు మన దగ్గర సమాధానం లేదంటూ ఓ వ్యక్తి ట్విట్ చేశారు. కవితా కౌశిక్ ఏక్తాకపూర్ నిర్మించిన కుటుంబ సీరియల్ తో బుల్లి తెరపై అడుగు పెట్టింది.. ఎఫ్ ఐ ఆర్ సీరియల్ తో పాపులర్ అయ్యింది.

Also Read: షికారుకు వెళ్లి అడవిలో తప్పిపోయిన రాజకీయ నేత.. 18 రోజులపాటు ప్రాణం కోసం ఆకలితో పోరాటం