చౌక బారు విమర్శలు వద్దు : మంత్రి అనిల్ కుమార్ యాదవ్

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు. కొందరు ఇళ్లల్లో నుంచి బయటికి రాకుండానే ప్రభుత్వంపై చౌక బారు విమర్శలు చేస్తున్నారని..

చౌక బారు విమర్శలు వద్దు : మంత్రి అనిల్ కుమార్ యాదవ్
Follow us

|

Updated on: Sep 11, 2020 | 6:56 PM

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు. కొందరు ఇళ్లల్లో నుంచి బయటికి రాకుండానే ప్రభుత్వంపై చౌక బారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చేతిలో పేపర్లు, ఛానళ్లు ఉన్నాయికదాని ఇలాంటి చౌక బారు విమర్శలు చేయడం మానుకోవాలని ప్రతిపక్షనేత చంద్రబాబుకి పరోక్షంగా చురకలు అంటించారు. తన ఎల్లో మీడియా ద్వారా ప్రజల్లో అపోహలు, భయభ్రాంతులు కలిగించేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నెల్లూరు నగరంలోని పలు వార్డుల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..గడిచిన టీడీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పుకొచ్చారు. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్య త్వరలోనే తీరనుందని.. అందుకు సంబంధించి కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు వస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను కులమతాలకతీతంగా అందరికీ అందిస్తున్నారని చెప్పుకొచ్చారు.