సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..

|

Jul 15, 2020 | 1:25 AM

Registrations In Grama Sachivalayam: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఇక నుంచి గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని సేవలను గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లను సైతం ఇక్కడే నుంచే చెయ్యాలని నిర్ణయించింది. ఇందులో కోసం ప్రయోగాత్మకంగా గుంటూరులోని కాజా సచివాలయాన్ని ఎంపిక చేసింది. ఈ నెల 15, […]

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..
Follow us on

Registrations In Grama Sachivalayam: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఇక నుంచి గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని సేవలను గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లను సైతం ఇక్కడే నుంచే చెయ్యాలని నిర్ణయించింది.

ఇందులో కోసం ప్రయోగాత్మకంగా గుంటూరులోని కాజా సచివాలయాన్ని ఎంపిక చేసింది. ఈ నెల 15, 16వ తేదీల్లో సబ్ రిజిస్టార్ అధ్వర్యంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సచివాలయంలో ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం విజయవంతం అయిన అనంతరం రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్దం చేస్తోంది. కాగా, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురూ అయితే ప్రయాణ భారంతో పాటు ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు ఉంటున్నాయని ప్రజలు భావిస్తున్నారు.

Also Read: ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్సు సర్వీసులు నిలిచిపోయినట్లే.!