AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 506 వైరస్ పాజిటివ్ కేసులు, యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే..?

|

Dec 13, 2020 | 5:11 PM

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 63,873 కరోనా టెస్టులు చేయగా.. 506 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 506 వైరస్ పాజిటివ్ కేసులు, యాక్టీవ్ కేసుల సంఖ్య ఎంతంటే..?
Follow us on

ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 63,873 కరోనా టెస్టులు చేయగా.. 506 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,75,531కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. కొత్తగా మరో  ఐదుగురు వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల సంఖ్య 7,057 కు చేరింది. కొత్తగా 613 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా.. రికవరీల సంఖ్య 8,63,508కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,966 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,08,30,990 కరోనా సాంపుల్స్‌ని టెస్ట్ చేసినట్లు వివరించింది.

వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ..వైరస్ పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు.

 

Also Read :

Bigg Boss Telugu 4 : మనసులోని భావాలను బయటపెట్టిన అభిజిత్..ఈ విషయం అస్సలు ఊహించి ఉండరు

Bigg Boss Telugu 4 : మరోసారి వివాదం రేపిన రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..సోహైల్‌పై షాకింగ్ కామెంట్స్

కొండంత ట్రాఫిక్..శ్రీశైలంలో పద్మవ్యూహంలో చిక్కుకున్న భక్తులు..5 కిలోమీటర్ల మేర జామ్

లాక్‌డౌన్ సమయంలో చెక్‌పోస్టుల వద్ద గంజాయి స్మగ్లర్లతో స్నేహం, ఆపై ఏఆర్ కానిస్టేబుల్ ఏం చేశాడంటే