పరిశుభ్రత విషయంలో రాజీపడొద్దు..: ఏపీ సీఎం జగన్

వైద్య ఆరోగ్యశాఖలో నాడు- నేడుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాడు – నేడు కింద కొత్తగా తీసుకొస్తున్న 16 మెడికల్‌ కాలేజీలు..

పరిశుభ్రత విషయంలో రాజీపడొద్దు..: ఏపీ సీఎం జగన్
Follow us

|

Updated on: Oct 29, 2020 | 6:47 PM

AP CM Jagan Review :  వైద్య ఆరోగ్యశాఖలో నాడు- నేడుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాడు – నేడు కింద కొత్తగా తీసుకొస్తున్న 16 మెడికల్‌ కాలేజీలు, ఉన్న మెడికల్‌ కాలేజీల్లో అభివృద్ధి, పునరుద్ధరణ పనులు, అలాగే సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ తదితర వాటి నిర్మాణాలు, అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష చేశారు.

నిధుల సమీకరణ, టెండర్లు, జరుగుతున్న పనులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. మొత్తంగా వీటికి 17,300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు. నవంబర్‌ 13 నుంచి ఆరోగ్యశ్రీ కింద 2 వేల వ్యాధులకు చికిత్స అందించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. హెల్త్‌ క్లీనిక్స్‌ వచ్చే వరకూ ఆరోగ్యశ్రీ రిఫరల్‌ పాయింట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయని తెలిపారు. జనవరిలోగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలకు టెండర్లు పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు. కాలేజీల్లో గ్రీన్‌ బిల్డింగ్స్‌ ఉంటాయని వెల్లడించారు.

ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు సౌకర్యాల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని, ఆస్పత్రుల్లో శానిటేషన్, పరిశుభ్రత విషయంలో రాజీపడొద్దని అధికారులను ఆదేశించారు. జనరేటర్లు పనిచేయడం లేదు.. ఏసీలు పనిచేయడంలేదు.. శుభ్రత లేదు.. శానిటేషన్‌ లేదనే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని అన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులతో దీటుగా ఉండాలని సూచించారు.