ఏపీలో ఆయుష్ కోర్సుల ఫీజులు ఖరారు.. హోమియోపతి, నర్సింగ్ వార్షిక రుసుముల వివరాలివే.. మరి ఆయుర్వేదం మాటేంటి?

|

Dec 23, 2020 | 7:36 PM

ఏపీలో ఆయుష్ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. హోమియోపతి వైద్య విద్యతోపాటు నర్సింగ్, వివిధ ఆయుష్ కోర్సులకు వార్షిక ఫీజులను నిర్ణయిస్తూ...

ఏపీలో ఆయుష్ కోర్సుల ఫీజులు ఖరారు.. హోమియోపతి, నర్సింగ్ వార్షిక రుసుముల వివరాలివే.. మరి ఆయుర్వేదం మాటేంటి?
Follow us on

AP Ayush courses fees finalized: ఏపీలో ఆయుష్ కోర్సుల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. హోమియోపతి వైద్య విద్యతోపాటు నర్సింగ్, వివిధ ఆయుష్ కోర్సులకు వార్షిక ఫీజులను నిర్ణయిస్తూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేశారు.

రాష్ట్రంలో నర్సింగ్, ఆయూష్ విభాగాలతో పాటు వివిధ పారామెడికల్ కోర్సులకు ఫీజు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కళాశాలల్లో ఆయా కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.  2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరాలకు ఫీజులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు- కన్వీనర్ కోటాలో సంవత్సరానికి 18 వేల రూపాయలు, మేనేజ్‌మెంటు కోటాలో 80 వేల రూపాయలుగా ఖరారు  చేశారు. పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు కన్వీనర్ కోటాలో 18 వేల రూపాయలు, మేనేజ్‌మెంటు కోటాలో 80 వేల రూపాయలుగా నిర్ణయించారు.

ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సుకు కన్వీనర్ కోటాలో 83 వేల రూపాయలు, మేనేజ్‌మెంటు కోటాలో లక్షా 49 వేల రూపాయలుగా నిర్దేశించారు. బీపీటీ కోర్సుకు కన్వీనర్ కోటాలో 18 వేల రూపాయలు, మేనేజ్‌మెంటు కోటాలో 80 వేల రూపాయలుగా నిర్ణయించారు. ఎంపీటీ కోర్సుకు కన్వీనర్ కోటాలో 94 వేల రూపాయలు, మేనేజ్‌మెంటు కోటాలో లక్షా 60 వేల రూపాయలుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బీహెచ్ఎంఎస్ (హోమియోపతి) కోర్సుకు కన్వీనర్ కోటాలో ఏటా  22 వేల రూపాయలు, మేనేజ్‌మెంటు కోటాలో అయితే ఏటా 3 లక్షల రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. బీఎస్సీ-ఎంఎల్టీ కోర్సుకు కన్వీనర్ కోటాలో ఏటా 18 వేల రూపాయలు.. మేనేజ్‌మెంటు కోటాలో అయితే ఏటా 80 వేల రూపాయలు వార్షిక ఫీజుగా చెల్లించవలసి వుంటుంది.  డీఎంఎల్టీ, పారామెడికల్ డిప్లమో కోర్సులకు కన్వీనర్ కోటాలో అయితే ఏటా 14 వేల రూపాయలు, మేనేజ్‌మెంటు కోటాలో అయితే 45 వేల రూపాయలు చెల్లించవలసి వుంటుంది. జీఎన్ఎం కోర్సులకు కన్వీనర్ కోటాలో అయితే ఏటా 15 వేల 500 రూపాయలు, మేనేజ్‌మెంటు కోటాలో అయితే 72 వేల రూపాయలుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.

ALSO READ: ఆ విషయంలో ఏపీ సర్కార్ భేష్..! పరిమితి పెంపునకు ఓకే

ALSO READ: తెలంగాణకు కరోనా సెకెండ్ వేవ్ థ్రెట్ లేదు.. శుభవార్త చెప్పిన ఆరోగ్య మంత్రి

ALSO READ: చాకోలేట్‌తో బాలుకు నివాళి.. వెరైటీగా బేకరీ సేల్స్

ALSO READ: పీవీఘాట్‌కు పోటెత్తిన రాజకీయ నేతలు.. మాజీ ప్రధాని సేవలను స్మరించిన సీఎం కేసీఆర్