A.P Weather Report : వర్షం లేకుండా ఉరుములు, మెరుపులు.. రాగల మూడురోజుల్లో వాతావరణం ఇలా మారనుంది..

|

Mar 16, 2021 | 5:35 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ మరియు దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం కారణంగా  రాష్ట్రం వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు కనిపించనున్నాయి.

A.P Weather Report : వర్షం లేకుండా ఉరుములు, మెరుపులు.. రాగల మూడురోజుల్లో వాతావరణం ఇలా మారనుంది..
Weather Report
Follow us on

Andhra PradeshWeather Report : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ మరియు దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం కారణంగా  రాష్ట్రం వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు కనిపించనున్నాయి. రాగల మూడు రోజుల వరకు వాతావరణలో మార్పుకు కనిపించనున్నాయి. ఈరోజు, రేపు ఆకాశం మేఘావృతంగా ఉంది. వర్షం లేకుండా కేవలం ఉరుములు, మెరుపులు వాతావరణం చల్లగా ఉండనుంది. ఇక  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా వశం లేకుండా ఉరుములు మెరుపులతో వాతావరణం మారనుంది.
ఇక మార్చి 18న ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ  తెలిపింది. అలాగే దక్షిణ కోస్తాంధ్రలో ఈ రో జు, రేపు మరియు ఎల్లుండి ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమ విషయానికొస్తే ఈ రోజు, రేపు మరియు
ఎల్లుండి ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పూర్తిగా వేసవికాలం రాక ముందే ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. మండుతున్న ఎండలుకు ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎండలనుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారాలు తెలుపుతున్నారు.
 మరిన్ని ఇక్కడ చదవండి : 

తిరుపతి లోక్‌సభ, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్.. ఏఫ్రిల్ 17న పోలింగ్ ‌

L Ramana : అమరావతిని ఎంపిక చేసిన తరువాతే అసైన్డ్ భూములు తీసుకున్నారు : తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు