అలెర్ట్ : ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు

|

Aug 23, 2020 | 9:02 AM

మరో రెండు రోజుల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని‌ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్ల‌డించింది.

అలెర్ట్ : ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు
Follow us on

మరో రెండు రోజుల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని‌ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్ల‌డించింది. అధికారులను అప్రమత్తంగా ఉండాల‌ని సూచించింది. కాగా ఇప్ప‌టికే కురిసిన భారీ వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. ప‌లు గ్రామాల మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. గోదావ‌రికి భారీగా వ‌ర‌ద పోటెత్త‌డంతో… తూర్పుగోదావరి జిల్లాలోని మన్యంతోపాటు కోనసీమ లంక గ్రామాలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి.

జిల్లాలోని 26 మండలాల పరిధిలోని 180 గ్రామాలు వరద ముంపుకు గుర‌య్యాయ‌ని కలెక్టర్ తెలిపారు. మొత్తం 82 గ్రామాల్లోకి వరద నీరు చేర‌గా.. వరదల్లో చిక్కుకుని ముగ్గురు మృతి చెందాని, మరో ఇద్దరు గల్లంతు అయినట్లు అధికారులు వెల్ల‌డించారు. జిల్లాలో 129 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి… సుమారు 57 వేల 607మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. సహాయక చ‌ర్య‌ల్లో 45 క్లస్టర్ టీమ్స్ ,14 మొబైల్ టీమ్స్‌తో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నట్టు క‌లెక్ట‌ర్ తెలిపారు.

 

Also Read :

మరో కీలక అనుమతి పొందిన ‘కొవాగ్జిన్’ !

పాశ‌వికం : మైనర్​పై సామూహిక అత్యాచారం, ఆపై సెప్టిక్​ ట్యాంకులో

వైఎస్‌ఆర్‌ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల