గౌస్ మరణంపై ఏపీ పోలీస్ శాఖ వివ‌ర‌ణ‌..ఏం చెప్పారంటే..

గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఇటీవ‌ల‌ ఓ యువకుడు పోలీసు దెబ్బ‌ల‌కు తాళ‌లేక మృతి చెందాడ‌న్న వార్త క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. దీనిపై వెంట‌నే స్పందిన పోలీస్ శాఖ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న‌ ఎస్సైను స‌స్పెండ్ చేసింది. సిటీలోని టింబర్‌ డిపో నిర్వ‌హించే షేక్‌ మహ్మద్‌ గౌస్‌(35) సోమవారం ఉదయం మెడిసిన్ కొనుక్కోని టూ వీల‌ర్ పై ఇంటికి తిరిగి వెళుతుండగా నరసరావుపేటరోడ్డులో చెక్‌ పోస్టు వద్ద ఎస్‌ఐ రమేశ్‌ ఆపి లాక్ డౌన్ విధుల్లో భాగంగా తనిఖీ […]

గౌస్ మరణంపై ఏపీ పోలీస్ శాఖ వివ‌ర‌ణ‌..ఏం చెప్పారంటే..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 22, 2020 | 5:02 PM

గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఇటీవ‌ల‌ ఓ యువకుడు పోలీసు దెబ్బ‌ల‌కు తాళ‌లేక మృతి చెందాడ‌న్న వార్త క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. దీనిపై వెంట‌నే స్పందిన పోలీస్ శాఖ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న‌ ఎస్సైను స‌స్పెండ్ చేసింది. సిటీలోని టింబర్‌ డిపో నిర్వ‌హించే షేక్‌ మహ్మద్‌ గౌస్‌(35) సోమవారం ఉదయం మెడిసిన్ కొనుక్కోని టూ వీల‌ర్ పై ఇంటికి తిరిగి వెళుతుండగా నరసరావుపేటరోడ్డులో చెక్‌ పోస్టు వద్ద ఎస్‌ఐ రమేశ్‌ ఆపి లాక్ డౌన్ విధుల్లో భాగంగా తనిఖీ చేసారు. ఈ క్ర‌మంలో గౌస్ ను పోలీసులు చిత‌క‌బాదార‌ని..అందుకే అత‌డు మ‌ర‌ణించాడ‌ని బంధువులు ఆరోపించారు. అయితో పోలీసుల‌ను చూసి భయంతో ఉన్న, హృద్రోగి కూడా అయిన గౌస్‌ పడిపోవడంతో తండ్రి షేక్‌ మహ్మద్‌ ఆదం ఆస్పత్రికి తరలించగా, ట్రీట్మెంట్ తీసుకుంటూ గౌస్ ప్రాణాలు విడిచాడ‌న్న‌ది పోలీసుల వెర్ష‌న్. దీనిపై మంగళవారం ఏపీ పోలీసులు ట్విటర్ లో వివరణ ఇచ్చారు.

‘గుంటూరు రూరల్ జిల్లాలో జరిగిన దురదృష్టకర సంఘటనలో షేక్ మహ్మద్ గౌస్ ప్రాణాలు విడిచారు. ఈ ఘ‌ట‌నకు సంబంధించి పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. చెక్ పోస్ట్ వద్ద మృతుడిని ఆపిన సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ డి.రమేష్ ను సస్పెండ్ చేశాం. చ‌నిపోయిన వ్యక్తి పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపదుతున్నారు. శ‌స్త్ర‌చికిత్స చేసి స్టెంట్లు వేశారు. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని పంచనామాలో తేలింది. మృతుని తండ్రి ఇచ్చిన కంప్లైంట్ లో కూడా పోలీసులపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. డీజీపీ డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీకి కూడా ఆదేశించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని విధానాలు పాటిస్తున్నాము’ అని ట్విటర్‌లో వివరించారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు