ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

|

Oct 19, 2020 | 8:02 PM

ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో కొత్తగా 61,330 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 2,918 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
Follow us on

ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో కొత్తగా 61,330 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 2,918 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఫలితంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,86,050 కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో మరో 24 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,453 కు చేరింది. ఇప్పటి వరకు 7,44,532 మంది బాధితులు కోలుకోగా… ప్రస్తుతం 35,065 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కేసులు…

తూర్పుగోదావరి 468, పశ్చిమగోదావరి 447, చిత్తూరు 380, గుంటూరు 333, ప్రకాశం 308, అనంతపురం 218, కడప 155, శ్రీకాకుళం 143, విశాఖ 120, నెల్లూరు 119, కృష్ణా 117, కర్నూలు 66, విజయనగరం 44 కరోనా కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా మరణాలు

కృష్ణా 4, గుంటూరు 4, విశాఖ 4, చిత్తూరు 4, కడప 3, తూర్పుగోదావరి 2, నెల్లూరు 1, ప్రకాశం 1, పశ్చిమగోదావరి 1 చొప్పున మృతి చెందారు.

Also Read :

కొండెక్కిన కూరగాయల ధరలు

పైసాకే బిర్యానీ..ఎగబడ్డ జనం