బ‌కెట్‌లో మ‌నిషి చేయి ల‌భ్యం, స్థానికంగా క‌ల‌క‌లం

|

Sep 06, 2020 | 5:55 PM

ఓ బ‌కెట్‌లో మ‌నిషి చేయి ల‌భించ‌డంతో క‌ల‌కలం చెల‌రేగింది. జార్ఖండ్‌లోని బారియాటు ఏరియాలో ఆదివారం ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది.

బ‌కెట్‌లో మ‌నిషి చేయి ల‌భ్యం, స్థానికంగా క‌ల‌క‌లం
Follow us on

ఓ బ‌కెట్‌లో మ‌నిషి చేయి ల‌భించ‌డంతో క‌ల‌కలం చెల‌రేగింది. జార్ఖండ్‌లోని బారియాటు ఏరియాలో ఆదివారం ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న బ‌కెట్‌ను ప‌రిశీలించ‌గా అందులో తెగిన చేయి క‌నిపించ‌డంతో స్థానికులు ఒక్క‌సారిగా షాక్‌కు గురయ్యారు. వెంట‌నే స‌మాచారాన్ని పోలీసుల‌కు చేర‌వేశారు.
పోలీసులు వ‌చ్చి బ‌కెట్‌లో ల‌భించిన చేతిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తెగిన చేతి ఒక క్యాన్స‌ర్ రోగిద‌ని త‌మ‌ దర్యాప్తులో తేలింద‌ని పోలీసులు వివ‌రించారు. టెస్ట్‌కు సంబంధించి ల్యాబ్‌కు పంపేందుకు ఒక చోట ఉంచగా అది మాయమైనట్లు స‌ద‌రు ఆసుప‌త్రి స్టాఫ్ తెలిపారు. కాగా తెగిన చేయి ఆసుప‌త్రి నుంచి బ‌కెట్‌లోకి ఎలా వ‌చ్చింద‌న్న విష‌యంపై విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు రాంచీ సిటీ ఎస్పీ సౌరభ్ తెలిపారు.

 

Also Read :

క‌రోనా సోకింద‌ని అమ్మ‌ను పొలం వ‌ద్ద వ‌దిలేశారు

జ‌గ‌న్ మార్క్ నిర్ణయం : మండలానికి రెండు పీహెచ్‌సీలు