Amaravati agitation: ఇకపై హైదరాబాద్‌లోను అమరావతి ఆందోళనలు

అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న అమరావతి పరిరక్షణ జేఏసీ ఇకపై ఆందోళనను మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలతోపాటు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోను...

Amaravati agitation: ఇకపై హైదరాబాద్‌లోను అమరావతి ఆందోళనలు
Follow us

|

Updated on: Feb 29, 2020 | 5:19 PM

Amaravati agitation in Hyderabad: అమరావతినే ఏపీ రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న అమరావతి పరిరక్షణ జేఏసీ ఇకపై ఆందోళనను మరింతగా విస్తరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలతోపాటు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోను అమరావతి ఆందోళన కొనసాగించాలని జేఏసీ ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం శనివారం భేటీ అయ్యింది. వైసీపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు.

అమరావతి జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానాలను ప్రతినిధులు వెల్లడించారు. ఆందోళనతో చనిపోయిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. ఇకపై అమరావతి రాజధాని ఆందోళనను 13 జిల్లాలకు జాక్ కార్యక్రమాలు విస్తరించాలని తీర్మానించారు. హైదరాబాద్‌లో కూడా జాక్ ద్వారా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం చేశారు.

ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వారు స్పందించేలా చేయాలని తలపెట్టారు. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా పోలీసులు చేసే డ్రోన్ ఆపరేషన్ నిలుపుదలచేయాలని డిమాండ్ చేస్తోంది జాక్. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదని డిమాండ్ చేశారు జాక్ ప్రతినిదులు. ఉద్యమిస్తున్న మహిళలపై నమోదు చేస్తున్న కేసులను బేషరతుగా ఎత్తివేయాలని కోరారు.

Latest Articles
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
పర్యాటకులకు గుడ్‌న్యూస్‌.. ప్రారంభం కానున్న మొదటి ప్రైవేట్ రైలు
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఈఏపీసెట్‌ 2024 హాల్‌ టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
ఎన్నికల వేళ పవన్ గురించి నాని ఊహించని ట్వీట్
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
స్పాట్ ఫిక్సింగ్‌ కేసులో జైలుకు.. 5 ఏళ్ల నిషేధం.. కట్‌చేస్తే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
గొప్ప మైలేజీని అందించే బజాజ్ సీఎన్‌జీ బైక్‌లు..ఎప్పుడంటే..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా…? ఫామ్-16 విషయంలో ఆ తప్పు వద్దంతే
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
ఓటు వేయడానికి ఉదయాన్నే బయలుదేరాడు.. కేంద్రం సమీపంలోకి రాగానే..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
అందం ఈ వయ్యారితో పోటీలో ఒడి.. ఈమె వద్ద బందీగా మారిందేమో..
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
'తీవ్రమైన గాయాలు.. మెడిసిన్‌తోనే మైదానంలోకి ధోని'
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్