Aliens Contact Humans: ఏలియన్స్ కమ్యూనికేట్ కావాలనుకుంటున్నాయా.? దాని రీజన్ ఇదే.!

|

Feb 05, 2021 | 1:49 PM

Aliens Contact Humans: ఈ విశ్వం మనకు మాత్రమే సొంతం కాదని బలంగా భావిస్తున్న శాస్త్రవేత్తలు ఏలియన్స్‌పై గత కొన్నేళ్లుగా పరిశోధనలు....

Aliens Contact Humans: ఏలియన్స్ కమ్యూనికేట్ కావాలనుకుంటున్నాయా.? దాని రీజన్ ఇదే.!
Follow us on

Aliens Contact Humans: ఈ విశ్వం మనకు మాత్రమే సొంతం కాదని బలంగా భావిస్తున్న శాస్త్రవేత్తలు ఏలియన్స్‌పై గత కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇన్నేళ్లలో వాటికి సంబంధించిన ఏ కచ్చిత ఆధారాన్ని సాధించలేకపోయారు. కానీ ఏలియన్స్ ఉన్నాయంటూ ప్రగాఢంగా నమ్ముతున్న వారు తమ పరిశోధనలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆస్ట్రోఫిజికిస్ట్, కీలే అబ్జర్వేటరీ డైరక్టర్ జాకో వాన్ లూన్ ఏలియన్స్ ఉన్నాయని.. అవి మనుషులతో కాంటాక్టు కావడానికి ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు.

మనుషులతో కమ్యూనికేట్ కావడానికి ఏలియన్స్ చూస్తున్నాయా.?

ఆస్ట్రోఫిజికిస్టులు చెబుతున్న బట్టి చూస్తే.. ఏలియన్స్ అన్నది నిజమైతే.. మనుషులు ఎలా వాటిని కలవాలని ఎదురు చూస్తున్నారో.. అవి కూడా అటు వైపు నుంచి మనుషుల తరహాలోనే ప్రయత్నిస్తుండొచ్చు అని అంటున్నారు. అవి సహాయం లేదా స్నేహం కోసం ట్రై చేస్తూ ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఏలియన్స్‌ను కలిసేందుకు మనుషులకు చాలానే కారణాలు ఉన్నాయి. భారీ కాస్మోస్‌లో మనుగడ సాగిస్తున్న ఏలియన్స్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయని.. భూమి మీద నుంచి వచ్చే సంకేతాలు వాటికి చేరి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Also Read:

India vs England, 1st Test, Day 1 LIVE Score: రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.. అధిపత్యం చలాయిస్తున్న టీమిండియా..