స్వదేశీ వ్యాక్సిన్‌పై అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు.. ఆ పార్టీ టీకా వేయించుకోనంటూ..

|

Jan 03, 2021 | 7:57 AM

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీ అని కేంద్రం ప్రకటనపై యూపీ మాజీ సీఎం స్పందించారు. కరోనా టీకాను తాను తీసుకోబోనంటూ ఆసక్తికర..

స్వదేశీ వ్యాక్సిన్‌పై అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు.. ఆ పార్టీ టీకా వేయించుకోనంటూ..
Akhilesh Yadav
Follow us on

Akhilesh Yadav : దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ఫ్రీ అని కేంద్రం ప్రకటన చేయడంతో యూపీ మాజీ సీఎం స్పందించారు. కరోనా టీకాను తాను తీసుకోబోనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అది బీజేపీ వ్యాక్సిన్ అంటూ కామెంట్ చేశారు. దాన్ని ఎలా నమ్ముతామని ప్రశ్నించారు.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ సౌజన్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి లభించిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన డ్రై రన్‌‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

ఈ ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా తొలి దశలో 3 కోట్ల మందికి ఉచిత టీకా అందజేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ ప్రకటించిన సంగతి తెలిసిదే. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్న అఖిలేశ్‌ యాదవ్‌ను వ్యాక్సిన్‌ గురించి మీడియా ప్రశ్నించగా.. ఆయన ఈ కామెంట్స్ చేశారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరికీ ఫ్రీగా వ్యాక్సిన్‌ వేయిస్తామని చెప్పారు. అఖిలేశ్‌ వ్యాఖ్యలను బీజేపీ  నేత, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఖండించారు. వ్యాక్సిన్‌పై వ్యాఖ్యలు చేయడం ద్వారా డాక్టర్లను, సైంటిస్టులను ఆయన అవమానిస్తున్నారని అన్నారు. దీనిపై అఖిలేశ్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి..:

Mumbai Cop Saves : ఓ నిండు ప్రాణం కాపాడిన కానిస్టెబుల్ అప్రమత్తత.. ముంబై రైల్వే స్టేషన్‌లో ఘటన