“వరద బాధితులకు ప్రభుత్వ సాయం అభినందనీయం”

| Edited By: Pardhasaradhi Peri

Oct 24, 2020 | 9:33 PM

హైదరాబాద్ వరద బాధితులకు ప్రభుత్వం అందించే రూ.10వేలు సాయం అభినందనీయమని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు.

వరద బాధితులకు ప్రభుత్వ సాయం అభినందనీయం
Follow us on

హైదరాబాద్ వరద బాధితులకు ప్రభుత్వం అందించే రూ.10వేలు సాయం అభినందనీయమని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు.  వరద బాధితులకు మరింత సాయం అందించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి సమయంలో విమర్శలు తగవని, అందరూ కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారు. పాతబస్తీ ప్రజలు వరదల్లో బాగా నష్టపోయారని, వరదల కారణంగా నష్టపోయిన ప్రతీ ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. 117 ఏళ్ల తర్వాత నగరంలో 29 సెం.మీ వర్ష పాతం నమోదైందని, 117 ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో 15వేల మంది చనిపోయారని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిణామాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సాలరే మిల్లత్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ నుంచి 33 వస్తువులను వరద బాధితులను ఇస్తున్నట్లు తెలిపారు.  ఇక పార్టీ ఆదేశిస్తే బీహార్‌ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తానని అక్బరుద్దీన్‌ ఓవైసీ వెల్లడించారు.

Also Read :

అక్కడ బుల్లెట్‌కు పూజలు, గుడి కూడా కట్టేశారు !

హైదరాబాదులో పాల ఏటీఎం