బ్రేకింగ్: ఎయిర్ ఏషియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

| Edited By:

May 26, 2020 | 6:06 PM

ఎయిర్ ఏషియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. I-51543 ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా హైదరాబాద్ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్..

బ్రేకింగ్: ఎయిర్ ఏషియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
Follow us on

ఎయిర్ ఏషియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. I-51543 ఎయిర్ ఏషియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా హైదరాబాద్ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు అధికారులు. జైపూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానంలో.. ఫ్యూయల్ లీకేజీతో ఇంజిన్‌లో సమస్య రావడంతో.. అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని ల్యాండ్ చేసినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. కాగా ఈ ఫ్లైట్‌లో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కరోనా వైరస్ కారణంగా గత రెండు నెలలుగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ప్రజలు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో.. రెండు, మూడు రోజుల నుంచి దేశ వ్యాప్తంగా రాకపోకలు కొనసాగిస్తున్నాయి.

strong>Read More:

రైతులకు మరో గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్..

ప్రధాని ‘కిసాన్ స్కీమ్’ డబ్బులు.. మీ అకౌంట్లోకి రావడం లేదా? ఇలా చేయండి..

మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్

బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!