ఆమ్లెట్‌లో పెంకులు.. షాక్ తిన్న ఎంపీ

ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ నిర్లక్ష్యం కారణంగా రాజ్యసభ సభ్యురాలు వందనా చవాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల పూణె నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లిన ఆమె.. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆమ్లెట్‌ను ఆర్డర్ చేశారు. తనకు అందిన ఆమ్లెట్‌ చూసి ఆమె షాక్ తిన్నారు. అసలు ఆమ్లెట్ తినాలో వద్దో కూడా తెలియని స్థితిలో పడ్డారు. ఇందుకు కారణం ఆ డిష్ లో కోడిగుడ్డు పెంకులు కనపడటమే. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన వందనా […]

ఆమ్లెట్‌లో పెంకులు.. షాక్ తిన్న ఎంపీ
Follow us

| Edited By:

Updated on: Oct 08, 2019 | 12:39 PM

ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ నిర్లక్ష్యం కారణంగా రాజ్యసభ సభ్యురాలు వందనా చవాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల పూణె నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లిన ఆమె.. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆమ్లెట్‌ను ఆర్డర్ చేశారు. తనకు అందిన ఆమ్లెట్‌ చూసి ఆమె షాక్ తిన్నారు. అసలు ఆమ్లెట్ తినాలో వద్దో కూడా తెలియని స్థితిలో పడ్డారు. ఇందుకు కారణం ఆ డిష్ లో కోడిగుడ్డు పెంకులు కనపడటమే. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన వందనా చవాన్ ఎయిర్ ఇండియా సంస్థకు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎయిర్ ఇండియా.. క్యాటరింగ్ ఏజెన్సీకి జరిమానా విధించినట్లు తెలిపింది. నిర్వహణ ఛార్జీలు, ఆ విమానంలో సరఫరా చేసిన మొత్తం ఆహారానికి అయిన ఖర్చును భరించాలని ఆ సంస్థ ప్రతినిధి ధనంజయ్ కుమార్ వెల్లడించారు.

తనకు కలిగిన ఈ అనుభవాన్ని వందనా వివరంగా ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానంలో పూణె నుంచి ఢిల్లీకి వెళ్లాను. బ్రేక్ ఫాస్ట్‌లో ఆమ్లెట్ ఆర్డ్రర్ చేస్తే.. అందులో కోడి గుడ్డు పెంకులు వచ్చాయి. బంగాళదుంప ముక్కలు పాడయ్యాయి. సోయాచిక్కుడు ఉడకనేలేదు. ఎయిర్ హోస్టెస్ దీనికి బాధ్యులు కారని అభిప్రాయపడుతున్నాను. ట్వీట్ చేయొద్దనుకున్నానని.. కాని, ప్రజా ప్రయోజనార్థమే ముఖ్యమనిపించిందని, అందుకే ఫిర్యాదు చేస్తున్నానని వందనా చవాన్ ట్వీట్ చేశారు.